4 రోజుల నష్టాలకు తెర

ABN , First Publish Date - 2020-02-20T06:26:15+05:30 IST

వరుసగా నాలుగు రోజులపాటు నష్టాలను మూటగట్టుకున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారంనాడు లాభాల బాటపట్టాయి. చైనాలో కరోనా వైరస్‌ కేసు లు తగ్గుముఖం పట్టడం, ఈ వైరస్‌ పట్ల తగిన

4 రోజుల నష్టాలకు తెర

429 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

ముంబై: వరుసగా నాలుగు రోజులపాటు నష్టాలను మూటగట్టుకున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారంనాడు లాభాల బాటపట్టాయి. చైనాలో కరోనా వైరస్‌ కేసు లు తగ్గుముఖం పట్టడం, ఈ వైరస్‌ పట్ల తగిన చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వం హామీ ఇవ్వడం వంటి ప్రకటనల నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు పెరిగాయి. బుధవారం బీఎ్‌సఈ సెన్సెక్స్‌ ఒక దశలో 41,357.16 పాయింట్ల గరి ష్ఠ స్థాయిని తాకింది. చివరకు 428.62 పాయింట్ల లాభంతో 41,323 పాయిం ట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 133.40 పాయింట్లు పెరిగి 12,125.90 పాయింట్ల వద్ద క్లోజైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారంనాడు ఫార్మాసూటికల్స్‌, టెక్స్‌టైల్స్‌, కెమికల్స్‌, ఎలక్ర్టానిక్స్‌, ఐటీ హార్డ్‌వేర్‌, సోలార్‌, ఆటో, సర్జికల్‌ ఎక్వి్‌పమెంట్స్‌, పెయింట్స్‌ వంటి రంగాల ప్రతినిధులతో భేటీ కావటం మార్కెట్లో ఉత్సా హాన్ని నింపింది. దీంతో బీఎ్‌సఈ ఎనర్జీ, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు 2.37 శాతం వరకు పెరిగాయి. బీఎ్‌సఈలోని మొత్తం 19 రంగాల సూచీలు లాభాలతో ముగిశాయి. 


అరబిందో అదుర్స్‌..

హైదరాబాద్‌లోని యూనిట్‌-4 కు సంబంధించి యూఎ స్‌ఎ్‌ఫడీఏ నుంచి ఎస్టాబ్లి్‌షమెంట్‌ ఇన్‌స్పెక్షన్‌ నివేదిక వచ్చిన నేపథ్యంలో అరబిందో ఫార్మా షేరు బుధవారంనాడు జోరుగా పెరిగింది. బీఎ్‌సఈలో 20.40 శాతం లాభంతో రూ. 602.25 వద్ద ముగిసింది. ఎన్‌ఎ్‌సఈలో 20.78 శాతం పెరిగి రూ. 604.40 వద్ద క్లోజైంది. 


వొడాఐడియా షేరు 38 శాతం జంప్‌

కంపెనీ బ్యాంకు గ్యారెంటీలను ప్రభుత్వం నగదుగా మార్చుకునే అవకాశం లేదన్న వార్తల నేపథ్యంలో బుధవారం వొడాఫోన్‌ ఐడియా షేరు భారీగా పెరిగింది. బీఎ్‌సఈలో ఒక దశలో 48.18 శాతం పెరిగిన షేరు రూ.4.49 స్థాయికి చేరుకుంది. చివరకు 38.28 శాతం లాభంతో రూ.4.19 వద్ద క్లోజైంది. ఎన్‌ఎ్‌సఈలో 40 శాతం పెరిగి రూ.4.20 వద్ద క్లోజైంది.

Updated Date - 2020-02-20T06:26:15+05:30 IST