delhi airport : ఫుట్ ఓవర్‌బ్రిడ్జ్ కింద ఇరుక్కున్న విమానం...వీడియో వైరల్

ABN , First Publish Date - 2021-10-04T13:56:07+05:30 IST

ఢిల్లీలో ఓ విమానం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద ఇరుక్కున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది...

delhi airport : ఫుట్ ఓవర్‌బ్రిడ్జ్ కింద ఇరుక్కున్న విమానం...వీడియో వైరల్

న్యూఢిల్లీ : ఢిల్లీలో ఓ విమానం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద ఇరుక్కున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీ విమానాశ్రయం బయట ఢిల్లీ-గురుగ్రాం జాతీయ రహదారిపై ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద ఎయిర్ ఇండియా విమానం ఇరుక్కుపోయింది. ఎయిర్ ఇండియా పాత విమానం స్రాప్ కింద విక్రయించడంతో దాన్ని కొన్న యజమాని తరలిస్తుండగా ప్రమాదవశాత్తూ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిందని విమానాశ్రయ అధికారులు చెప్పారు. ఎయిర్ ఇండియా విమానం పాదచారుల వంతెన కింద ఇరుక్కుపోయిన ఘటనతో తమకు సంబంధం లేదని, ఆ పాత విమానాన్ని తుక్కు కింద విక్రయించామని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి చెప్పారు.


 విమానం ఇరుక్కు పోవడంతో రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.విమానం ముందు భాగం ఫుట్ ఓవర్ బ్రిడ్జి దాటిందని, వెనుక భాగం బ్రిడ్జ్ వద్ద ఇరుక్కుందని అధికారులు చెప్పారు. రెక్కలు లేని పాత విమానం రవాణ చేస్తుండగా ఇరుక్కుందని విమానాశ్రయ అధికారులు చెప్పారు. గత ఏడాది పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని దుర్గాపూర్ నగరంలోనూ ఇలానే పాత విమానం బ్రిడ్జి వద్ద ఇరుక్కుపోయింది. విమానం ఎత్తు ఎక్కువగా ఉండటంతో విమానం బ్రిడ్జి వద్ద ఇరుక్కుపోయింది.


Updated Date - 2021-10-04T13:56:07+05:30 IST