ఇటీవల ఎడతెరిపి లేకుండా వానలు కురిసి ఆగడంతో రైతులు ఇప్పుడిప్పుడే పొలం పనులు మొదలుపెట్టారు. ట్రాక్టర్లతో దున్నుతూ వరినాట్లకు కయ్యలను సిద్ధం చేస్తున్నారు. దున్నకాలు జరుగుతున్న సమయంలో నేలలోంచి లేచే పురుగులకోసం కొంగలు వందల సంఖ్యలో వచ్చి వాలుతున్నాయి. వీటిని చూస్తే కయ్యల్లో కొంగలు మొలిచాయా అనేలా కనిపిస్తున్నాయి. కమలాపురం బ్రిడ్జికి సమీపంలోని పొలాల్లో మంగళవారం కొంగలు ఇలా కనువిందు చేశాయి.
- ఫొటోలు : స్టాఫ్ ఫొటోగ్రాఫర్, కడప