రాజస్తాన్ వ్యవహారంపై స్పందించిన జ్యోతిరాధిత్య

ABN , First Publish Date - 2020-07-12T23:47:30+05:30 IST

కొద్ది రోజుల క్రితం తనకు మద్దతుగా ఉన్న 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు సిందియా. దీంతో మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చింది

రాజస్తాన్ వ్యవహారంపై స్పందించిన జ్యోతిరాధిత్య

భోపాల్: రాజస్తాన్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై బీజేపీ నేత, సచిన్ పైలట్ మిత్రుడు జ్యోతిరాదిత్య సిందియా స్పందించారు. అశోక్ గెహ్లాట్ చేత సచిన్ పైలట్ హింసించబడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ప్రతిభా సామర్ధ్యాలకు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత ఉండదని విమర్శలు గుప్పించారు.


‘‘నా పాత సహచరుడు సచిన్‌ పైలట్‌కు కూడా ఇలాగే జరగడం చాలా బాధాకరం. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్‌ను పక్కన పెట్టడమే కాకుండా హింసించారు. ప్రతిభా సామర్ధ్యాలకు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత ఉండదని మరోసారి రుజువైంది’’ అని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో సిందియా రాసుకొచ్చారు.


కొద్ది రోజుల క్రితం తనకు మద్దతుగా ఉన్న 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు సిందియా. దీంతో మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం రాజస్తాన్‌లో కొనసాగుతున్న పరిణామాలు చూస్తుంటే గెహ్లాట్ ప్రభుత్వం సైతం కూలిపోతుందనే ఊహాగాణాలు ఊపందుకున్నాయి.

Updated Date - 2020-07-12T23:47:30+05:30 IST