శాస్త్రోక్తంగా మహాసౌర హోమం

ABN , First Publish Date - 2021-01-25T05:18:23+05:30 IST

అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో మహాసౌర హోమం శాస్త్రోక్తంగా జరుగుతుంది. రెండోరోజు ఆదివారం ఉదయం సుప్రభాత సేవ, వేదహ వనం, అరుణతవనం, వైనతేయ హోమం, సూర్యనమస్కా రాలు, మధ్యాహ్నం మలన్యాస మంత్రపఠనపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, వైనతేయ హోమం, మంగళ హారతి కార్యక్రమాలు నిర్వహించారు.

శాస్త్రోక్తంగా మహాసౌర హోమం
హోమం చేస్తున్న అర్చకులు

గుజరాతీపేట: అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో మహాసౌర హోమం శాస్త్రోక్తంగా జరుగుతుంది. రెండోరోజు ఆదివారం ఉదయం సుప్రభాత సేవ, వేదహ వనం, అరుణతవనం, వైనతేయ హోమం,  సూర్యనమస్కా రాలు, మధ్యాహ్నం మలన్యాస మంత్రపఠనపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,  వైనతేయ హోమం, మంగళ హారతి కార్యక్రమాలు నిర్వహించారు. విశాఖపట్నం భువనేశ్వరిపీఠంకు చెందిన రామా నందభారతి స్వామీజీ ఆలయానికి చేరుకొని  హోమం క్రతువును పర్యవేక్షించారు.    ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ, ఈవో హరిసూర్యప్రకాష్‌ పాల్గొన్నారు.

 

ఘనంగా ఆదిత్యుని కల్యాణం

పుష్యశుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని అరసవల్లి  సూర్యనారాయణ స్వామి కల్యా ణాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో ఆదిత్యుని కల్యాణం జరిపించారు. కొవిడ్‌ దృష్ట్యా భక్తులను అను మతించలేదు. కాగా, స్వామి దర్శనానికి భక్తు లు బారులు తీరారు.  ఇదేరోజున  స్వామికిరూ.6,50,559 ఆదాయం లభించింది. టిక్కెట్ల ద్వారా రూ.2,04,500, విరాళాల రూపంలో రూ.2,36,059, ప్రసాదాల రూపంలో రూ.2.10 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో హరిసూర్యప్రకాష్‌ వెల్లడించారు. విశాఖపట్నం కరూర్‌ వైశ్యాబ్యాంక్‌ డివిజనల్‌ హెడ్‌ కె.భానోజీరావు కుటుంబ సమేతంగా ఆదిత్యున్ని దర్శిం చుకొని, బంగారు మక రతోరణం నిమిత్తం రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఖాజీపేట వాసి ముద్దాడ కృష్ణ మూర్తినాయుడు 49.87 గ్రాముల బంగారు తామరనాళంను ఈవోకు అందజేశారు. 


తొగరాంలో భగవద్గీత పారాయణం

ఆమదాలవలస:పుష్యశుద్ధ ఏకాదశి పురస్కరించుకొని  తొగరాం  లక్ష్మీసహిత వల్లభనారాయణ, లక్ష్మీనరసింహా ఆలయాల్లో  ఆదివారం భగవద్గీత పారాయణం, విష్ణసహస్ర నామర్చన పురోహితులు చేశారు. కార్యక్రమంలో  పురోహితులు చింతాడ వాసుదేవరావు, రాఘవాచార్యులు, నారాయణ స్వామి పాల్గొన్నారు.


వేణుగోపాల స్వామికి అభిషేకాలు 

శ్వేతగిరి(గార): శ్వేతగిరిపై వెలసిఉన్న వేణుగోపాలస్వామికి పుష్యశుద్ధి ఏకాదశి సందర్భంగా ఆదివారం పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆలయ ట్రస్టు బోర్డు అధ్యక్షులు సుగ్గు మధురెడ్డి దంపతులు, అర్చకులు, రుక్మిణి సమేత వేణుగోపాలస్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 


Updated Date - 2021-01-25T05:18:23+05:30 IST