Advertisement
Advertisement
Abn logo
Advertisement

శాస్త్రోక్తంగా మట్టపల్లివాసుడి కల్యాణం

కల్యాణం నిర్వహిస్తున్న వేదపండితులు

మఠంపల్లి, నవంబరు 30 : మట్టపల్లి శ్రీలక్ష్మీనృసింహుడి క్షేత్రంలో స్వా మివారి నిత్యకల్యాణాన్ని వేదపండితులు మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలో విశ్వక్ష్సేన పూజ, పుణ్యహవాచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్యప్రాసన, మాంగళ్యధారణ, తలంబ్రాలు ఘట్టాల తో నిత్యకల్యాణం నిర్వహించారు. మహానివేదన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈవో సిరికొండ నవీన్‌, ఉద్యోగులు సిబ్బం ది పాల్గొన్నారు. అదేవిధంగా మట్టపల్లి క్షేత్రంలోని శ్రీపార్వతీరామలింగేశ్వరాలయంలో సుబ్రహ్మణ్యస్వామి భక్తకల్యాణాన్ని వైభవంగా నిర్వహించా రు. స్వామివారికి ఏకాదశ మహారుద్రాభిషేకం నిర్వహించారు. 

Advertisement
Advertisement