శాస్త్రోక్తంగా అభయాంజనేయ విగ్రహప్రతిష్ఠ

ABN , First Publish Date - 2022-08-08T05:28:59+05:30 IST

మండలంలోని తట్టివారిపల్లెలో ఆది వారం అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయస్వామివారి విగ్రహ ప్రతిష్ఠను ఆలయ కమిటీ సభ్యులు శాస్త్రోక్తంగా నిర్వహించా రు.

శాస్త్రోక్తంగా అభయాంజనేయ విగ్రహప్రతిష్ఠ
హోమం నిర్వహిస్తున్న దృశ్యం

మదనపల్లె, అర్బన్‌, ఆగస్టు 7: మండలంలోని తట్టివారిపల్లెలో ఆది వారం అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయస్వామివారి విగ్రహ ప్రతిష్ఠను ఆలయ కమిటీ సభ్యులు శాస్త్రోక్తంగా నిర్వహించా రు. ముందుగా ఆలయం ఆవరణలో ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలు, విశే ష పూజలు హోమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. అధికసంఖ్యలో భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వందాలది మందికి అన్నదానం చేశారు. 

సంతానలక్ష్మికి ప్రత్యేక పూజలు


గుర్రంకొండ, ఆగస్టు 7:గుర్రంకొండ మండలం చెర్లోపల్లెలో వెలసిన రెడ్డెమ్మకొండ ఆలయంలో ఆదివారం సంతానలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఉదయాన్నే అమ్మవారికి అర్చన, అభిషేకం, ప్రత్యేక పూజలను చేశారు.   సం తానంలేని దంపతులు సంతానం కోసం అమ్మవారి చెంత వరపడ్డారు. అమ్మవారి కృపతో సంతానం పొందిన మహిళలు మొక్కులు తీర్చుకోవాడానికి ఆలయానికి అధికంగా వచ్చారు. భక్తులకు అనుగుణంగా అన్ని వసతులను చైర్మన్‌ నరసింహారెడ్డి, ఈవో మంజులలు ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-08-08T05:28:59+05:30 IST