నేటి నుంచి సైన్స్‌ సెంటర్‌ సందర్శన

ABN , First Publish Date - 2021-01-16T04:59:39+05:30 IST

నేటి నుంచి సైన్స్‌ సెంటర్‌ సందర్శన

నేటి నుంచి సైన్స్‌ సెంటర్‌ సందర్శన

న్యూశాయంపేట, జనవరి15: హన్మకొండ హంటర్‌రోడ్‌లోని రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి ద్వారా నిర్వహించబడుతున్న రీజినల్‌ సైన్స్‌ సెంటర్‌లో సందర్శకులకు నేటి నుంచి అనుమతి ఇస్తున్నట్లు నిర్వాహక అధికారి వి.వెంకటేశ్వర్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ కారణంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 10 నెలలుగా సైన్స్‌ సెంటర్‌ను మూసివేశామన్నారు. ఇప్పుడు సందర్శకుల కోసం సైన్స్‌ సెంటర్‌లో ప్రదర్శనలకు అనుమతిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

సందర్శనకు వచ్చే వారు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, శానిటైజర్‌ వాడకం, మాస్క్‌లు తప్పక ధరించాలని కోరారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శనలు ఉంటాయని, ప్రతి సోమవారం, ప్రభుత్వ సెలవుదినాల్లో సైన్స్‌సెంటర్‌ మూసివేయబడుతుందని తెలిపారు.

Updated Date - 2021-01-16T04:59:39+05:30 IST