బడుల విలీనంపై ఆందోళనలు

ABN , First Publish Date - 2022-07-07T02:52:22+05:30 IST

‘మా పాఠశాలను వేరే పాఠశాలలో విలీనం చేయవద్దు’ అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పల్నాడు జిల్లా మాచవరం, బెల్లంకొండ మండల పరిధిలో బుధవారం

బడుల విలీనంపై ఆందోళనలు

అమరావతి: ‘మా పాఠశాలను వేరే పాఠశాలలో విలీనం చేయవద్దు’ అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పల్నాడు జిల్లా మాచవరం, బెల్లంకొండ మండల పరిధిలో బుధవారం ఆందోళనలు చేశారు. బెల్లంకొండ మండలం కొత్తగణేశునిపాడు ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు బుధవారం ఆర్‌అండ్‌బీ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం వల్ల 3,4,5 తరగతుల విద్యార్థులను అదే గ్రామంలో ఉన్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసే విధానానికి స్వస్థి పలకాలని డిమాండ్‌ చేశారు. దూరంలో ఉన్న పాఠశాలకు చిన్న పిల్లలు వెళ్లలేరన్నారు. ఎంపీడీవో రాజగోపాల్‌, పోలీసులు విద్యార్థుల తల్లిదండ్రులతో  సంప్రదింపులు జరిపారు. బెల్లంకొండ మండలం నందిరాజుపాలెం, మాచాయపాలెం, న్యూచిట్యాల  గ్రామాల్లో ఎంపీపీ స్కూల్లో 6,7,8 తరగతులను బెల్లంకొండ  జడ్పీ హైస్కూల్లో విలీనంపై తల్లిదండ్రులు పాఠశాల వద్ద ధర్నా చేపట్టారు.  పాత పాఠశాలలను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఎంపీడీవో గబ్రూనాయక్‌కు, ఎంఈవో రాజకుమారికి  శివారెడ్డిలకు వినతిపత్రం అందజేశారు. 

Updated Date - 2022-07-07T02:52:22+05:30 IST