బ‌హ్రెయిన్‌లో సెప్టెంబ‌ర్ 16న తెర‌చుకోనున్న‌ స్కూల్స్...

ABN , First Publish Date - 2020-06-07T17:50:34+05:30 IST

క‌రోనా సంక్షోభం నేప‌థ్యంలో బ‌హ్రెయిన్‌లో మార్చిలో మూత‌ప‌డ్డ ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూల్స్ సెప్టెంబ‌ర్ 16న తెర‌చుకోనున్నాయి.

బ‌హ్రెయిన్‌లో సెప్టెంబ‌ర్ 16న తెర‌చుకోనున్న‌ స్కూల్స్...

మ‌నామా: క‌రోనా సంక్షోభం నేప‌థ్యంలో బ‌హ్రెయిన్‌లో మార్చిలో మూత‌ప‌డ్డ ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూల్స్ సెప్టెంబ‌ర్ 16న తెర‌చుకోనున్నాయి. ఈ మేర‌కు బ‌హ్రెయిన్ విద్యాశాఖ మంత్రి మ‌జీద్ బిన్ అలీ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. మొద‌ట సెప్టెంబ‌ర్ 6న విద్యాశాఖ‌కు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ తిరిగి హాజ‌రుకావాల‌న్నారు. అనంత‌రం సెప్టెంబ‌ర్ 16 నుంచి విద్యార్థులు పాఠ‌శాల‌ల‌కు హాజ‌రు కావాల్సి ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు. అయితే... ప్ర‌స్తుత క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల దృష్ట్యా స్కూల్స్ యాజ‌మాన్యాలు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి అని సూచించారు. విద్యార్థుల‌కు సామాజిక దూరం, వ్య‌క్తిగ‌త శుభ్ర‌త‌, ముఖాల‌కు మాస్కు త‌దిత‌ర విష‌యాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని మంత్రి తెలియ‌జేశారు. ఇదిలా ఉంటే... బ‌హ్రెయిన్‌లో చాప‌కింద నీరులా విస్త‌రిస్తున్న క‌రోనా ఇప్ప‌టి వ‌ర‌కు 14,383 మందికి ప్ర‌బ‌లింది. మ‌రో 24 మందిని బ‌లిగొంది.   

Updated Date - 2020-06-07T17:50:34+05:30 IST