జులై ఐదు తర్వాతే... పాఠశాలలు పునప్రారంభం

ABN , First Publish Date - 2020-05-29T22:54:42+05:30 IST

పలు రాష్ట్రాలు విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాయి తెలంగాణ కూడా ఆచితూచి అడుగులేస్తోంది. కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాలలను దశలవారీగా తెరవాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా... జూలై 5 వరకు టెన్త్ పరీక్షలు జరగనుండటంతో... ఆ తర్వాతే స్కూల్స్ రీ-ఓపెన్ చేయాలని భావిస్తున్నారు.

జులై ఐదు తర్వాతే... పాఠశాలలు పునప్రారంభం

హైదరాబాద్ : పలు రాష్ట్రాలు విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాయి తెలంగాణ కూడా ఆచితూచి అడుగులేస్తోంది. కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాలలను దశలవారీగా తెరవాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా... జూలై 5 వరకు టెన్త్ పరీక్షలు జరగనుండటంతో... ఆ తర్వాతే స్కూల్స్ రీ-ఓపెన్ చేయాలని భావిస్తున్నారు.


అయితే ఒకేసారి కాకుండా మొదటగా 8, 9, 10 తరగతులు ప్రారంభించాలని, ఆ సమయంలో ఏవైనా భద్రతాపరమైన సమస్యలు ఎదురైతే... వాటిని సరిదిద్దుకుని 6, 7 తరగతులను ప్రారంభించనున్నారు. ప్రాథమిక పాఠశాలలను మాత్రం మరింత ఆలస్యంగా తెరవనున్నారు. ఇక... 


2020-21 విద్యా సంవత్సరాన్ని ఎప్పుడు మొదలుపెట్టాలన్న దానిపై పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో... ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం కానున్నారు.

Updated Date - 2020-05-29T22:54:42+05:30 IST