నవంబర్‌లో స్కూల్స్, కాలేజీలు, సినిమా థియేటర్స్ తిరిగి ప్రారంభం

ABN , First Publish Date - 2020-11-01T02:47:35+05:30 IST

నవంబర్‌లో స్కూల్స్, కాలేజీలు, సినిమా థియేటర్స్ తిరిగి ప్రారంభం

నవంబర్‌లో స్కూల్స్, కాలేజీలు, సినిమా థియేటర్స్ తిరిగి ప్రారంభం

చెన్నై: కరోనా వైరస్ లాక్‌డౌన్ నుంచి కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇవ్వడంతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ నెలలో పాఠశాలలు, కళాశాలలు, సినియా థియేటర్స్ తిరిగి ప్రారంభించేందుకు అనుమతి ఇస్తున్నట్లు తమిళనాడు సర్కారు పేర్కొంది.


నవంబర్ 16 నుంచి తమిళనాడులోని కళాశాలలు, పరిశోధన మరియు విద్యా సంస్థలతో పాటు 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు పాఠశాలల్లో తరగతులు పనిచేయడం ప్రారంభమవుతాయని సర్కారు వెల్లడించింది. నవంబర్ 10వ తేదీ నుంచి 50 శాతం సామర్థ్యంతో సినిమా థియేటర్స్, మల్టీప్లెక్సెస్, జంతుప్రదర్శనశాలలు, పార్కులను తిరిగి తెరిచేందుకు అనుమతి ఇస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఏదేమైనా లాక్‌డౌన్ కంటైన్ మెంట్ జోన్లలో అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.

Updated Date - 2020-11-01T02:47:35+05:30 IST