రోజు విడిచి రోజు

ABN , First Publish Date - 2020-10-31T05:49:44+05:30 IST

పాఠశాలలు, కళాశాలలు వచ్చే నెల రెండో తేదీ నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో విద్యా సంస్థల్లో కొవిడ్‌ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ ముత్యాలరాజు ఆదేశిం చారు.

రోజు విడిచి రోజు

వచ్చే నెల 2 నుంచి తరగతులు ప్రారంభం

కొవిడ్‌ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు 

టీచర్లు, లెక్చరర్ల హాజరు రోజూ తప్పనిసరి 

విద్యా శాఖ సమీక్షలో కలెక్టర్‌ ముత్యాలరాజు 

ఏలూరు ఎడ్యుకేషన్‌, అక్టోబరు 30 : పాఠశాలలు, కళాశాలలు వచ్చే నెల రెండో తేదీ నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో విద్యా సంస్థల్లో కొవిడ్‌ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ ముత్యాలరాజు ఆదేశిం చారు. విద్యా సంస్థలు ప్రారంభంపై శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో ఆయన సమీక్షించారు. రెండో తేదీ నుంచి 9, 10 తరగతులు, ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవ త్సరం తరగతులు రోజు విడిచి రోజు ఒంటి పూట తరగ తులు నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ మాస్క్‌ లు, శానిటైజర్లు విధిగా ఉండేలా చూడాలన్నారు. ప్రతి పాఠశాలలో కొవిడ్‌ పోస్టర్లు ప్రదర్శించాలని ఆదేశించారు. టీచర్లు, లెక్చరర్లు విధిగా హాజరు కావాల్సిందేనన్నారు. అన్ని విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులకు, బాల బాలికలకు కొవిడ్‌ టెస్ట్‌లను నిర్వహించాలన్నారు. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నిర్వహించడానికి అధికారు లు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. నవంబర్‌ 23 నుంచి 6, 7, 8 తరగతులకు రోజు విడిచి రోజు ఒంటిపూట తరగతులు ఉంటాయన్నారు. డిసెంబర్‌ 14న ఒకటి నుంచి ఐదో తరగతి క్లాసులు ప్రారంభించాలని కోరారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలన్నింటికీ ఇదే షెడ్యూల్‌ వర్తిస్తుంద న్నారు. జేసీలు వెంకటరమణారెడ్డి, ఎన్‌.తే జ్‌భరత్‌, డీఈవో రేణుక, ఇంటర్మీడియట్‌ విద్యా మండలి ఆర్‌ఐవో ప్రభాక రరావు, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ మధుసూదనరావు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్‌, పాల్గొన్నారు.


Updated Date - 2020-10-31T05:49:44+05:30 IST