Advertisement
Advertisement
Abn logo
Advertisement

అనంతపురం జిల్లాలో దారుణం.. ఇటుక, ఇసుక మోస్తున్న విద్యార్థులు

అనంతపురం: మన్నీల జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయురాలు శివమ్మ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఆదర్శనగర్‌లో ఆమె నిర్మిస్తున్న సొంత నూతన భవన నిర్మాణానికి పాఠశాల విద్యార్థులను కార్మికులిగా మార్చింది. ప్రతి ఆదివారం.. సెలవు రోజుల్లో విద్యార్థులతో టీచర్ శివమ్మ ఇటుకలు, సిమెంటు, ఇసుక మోయిస్తున్నారు. విద్యార్థుల చేత పనులు చేయించుకోవడాన్ని గత కొన్ని రోజులుగా ఆదర్శ్ నగర్ కాలనీ వాసులు గమనిస్తున్నారు.

తాజాగా మీడియాకు సమాచారం అందించారు. ప్రశ్నించిన మీడియా ప్రతినిధులను, స్థానికులను ఉపాధ్యాయురాలు శివమ్మ, ఆమె భర్త బెదిరించారు. ‘‘మీ చేతనైంది చేసుకోండి’’ అంటూ దురుసుగా ప్రవర్తించారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలే వారి చేత పనులు చేయించుకోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయురాలు శివమ్మపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

Advertisement
Advertisement