పాఠశాల విద్యార్థులకు స్మార్ట్‌కార్డులు

ABN , First Publish Date - 2022-06-07T14:59:34+05:30 IST

పాఠశాల విద్యార్థులకు స్మార్ట్‌ కార్డులు అందజేసేందుకు టెండర్లు ఆహ్వానించినట్లు రవాణా శాఖ మంత్రి పి.శివశంకర్‌ తెలిపారు. నగరంలో ఆయన సోమవారం మీడియాతో

పాఠశాల విద్యార్థులకు స్మార్ట్‌కార్డులు

- ప్రభుత్వ బస్సుల్లో ‘ఈ-టిక్కెట్‌’ విధానం 

- మంత్రి శివశంకర్‌


పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 6: పాఠశాల విద్యార్థులకు స్మార్ట్‌ కార్డులు అందజేసేందుకు టెండర్లు ఆహ్వానించినట్లు రవాణా శాఖ మంత్రి పి.శివశంకర్‌ తెలిపారు. నగరంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, టెండర్‌ ప్రక్రియ పూర్తిచేసి త్వరలో స్మార్ట్‌ కార్డులు పంపిణీ చేస్తామని, ఈ కార్డుల ద్వారా బస్సుల్లో విద్యార్థులు ఉచిత ప్రయాణం చేయవచ్చన్నారు. అప్పటి వరకు విద్యార్థులు పాత కార్డులను వినియోగించవచ్చని ఆయన వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలల వాహనాల ముందు, వెనుక సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని సూచించామని, పాఠశాలలు ప్రారంభించిన తర్వాత అధికారులు వాహనాలను పరిశీలిస్తారని తెలిపారు. కొందరు కార్మికులు విధులకు సక్రమంగా హాజరుకాకపోతుండడతో బస్సులు నడపడంలో ఇబ్బందులు వస్తున్నాయని, జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించి అన్ని బస్సులు నడిపేలా చర్యలు చేపడతామని తెలిపారు. బస్సుల్లో టిక్కెట్లకు బదులుగా ‘ఈ-టిక్కెట్‌’ సదుపాయం త్వరలో ప్రవేశపెట్టనున్నామన్నారు. ప్రయాణికులు జీ పే, క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి టిక్కెటు పొందవచ్చని మంత్రి శివశంకర్‌ తెలిపారు.

Updated Date - 2022-06-07T14:59:34+05:30 IST