రెండు రాష్ట్రాలు మినహా దేశ వ్యాప్తంగా పడిపోయిన విద్యా ప్రమాణాల స్థాయి

ABN , First Publish Date - 2022-05-27T19:55:33+05:30 IST

3 నుంచి 5వ తరగతి స్థాయిలో గణితం, భాషా నైపుణ్యాలు, పర్యావరణ శాస్త్రం వంటి విషయాలపై పరిశీలన చేశారట. అయితే పంజాబ్, రాజస్తాన్ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 2017 నాటి దేశ సగటు కంటే తక్కువ ప్రమాణాలు నమోదు అయ్యాయని..

రెండు రాష్ట్రాలు మినహా దేశ వ్యాప్తంగా పడిపోయిన విద్యా ప్రమాణాల స్థాయి

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా విద్యా వ్యవస్థల్లో ప్రమాణాలు పడిపోయాయి. పంజాబ్, రాజస్తాన్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2017 కంటే ముందు స్థాయికి విద్యా ప్రమాణాలు పడిపోయాయని నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే-2021(National Achievement Survey (NAS) 2021) తాజాగా వెల్లడించింది. అయితే కొవిడ్ మహమ్మారి ఇందుకు ప్రధాన కారణమై ఉంటుందని సర్వే తెలిపింది. దేశంలోని 720 జిల్లాల్లో ఉన్న 1.18 లక్షల పాఠశాలలను పరిశీలించిన అనంతరం తాజా సర్వే రిపోర్ట్‌ను రూపొందించినట్లు ఎన్ఏఎస్ పేర్కొంది.


3 నుంచి 5వ తరగతి స్థాయిలో గణితం, భాషా నైపుణ్యాలు, పర్యావరణ శాస్త్రం వంటి విషయాలపై పరిశీలన చేశారట. అయితే పంజాబ్, రాజస్తాన్ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 2017 నాటి దేశ సగటు కంటే తక్కువ ప్రమాణాలు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. ఈ విషయంలో తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు చివరి స్థానాల్లో ఉన్నాయట. అయితే 5వ తరగతి స్థాయిలో జమ్మూ కశ్మీర్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ కొంత మెరుగ్గా ఉన్నట్లు తెలిపారు. ఇక 8వ తరగతి స్థాయిలో గణితం, భాషా నైపుణ్యం, సైన్స్, సోషల్ లాంటి అంశాలను పరిశీలించగా అక్కడ కూడా ఇవే ఫలితాలు వచ్చాయి. అయితే ఈ స్థాయిలో ఛత్తీస్‌‌గఢ్ కొంత మెరుగ్గా ఉన్నట్లు ఎన్ఏఎస్ వెల్లడించింది.

Updated Date - 2022-05-27T19:55:33+05:30 IST