రేపటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభం... ఏ రాష్ట్రంలో ఏమనుకుంటున్నారు?

ABN , First Publish Date - 2020-09-20T15:52:31+05:30 IST

కరోనావైరస్ విజృంభిస్తున్ననేపధ్యంలో దేశవ్యాప్తంగా స్కూళ్లను, కాలేజీలను మూసివేశారు. అయితే సెప్టెంబరు 21 నుంచి ఎంపికచేసిన కొన్ని రాష్ట్రాలలోని విద్యాసంస్థలలో 9 నుంచి 12 క్లాసుల వరకూ తరగతులు తిరిగి ప్రారంభం...

రేపటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభం... ఏ రాష్ట్రంలో ఏమనుకుంటున్నారు?

న్యూఢిల్లీ: కరోనావైరస్ విజృంభిస్తున్ననేపధ్యంలో దేశవ్యాప్తంగా స్కూళ్లను, కాలేజీలను మూసివేశారు. అయితే సెప్టెంబరు 21 నుంచి ఎంపికచేసిన కొన్ని రాష్ట్రాలలోని విద్యాసంస్థలలో 9 నుంచి 12 క్లాసుల వరకూ తరగతులు తిరిగి ప్రారంభం కానున్నాయి. కేవలం 50 శాతం టీచర్లు, సిబ్బంది హాజరుతో విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. అయితే విద్యార్థులు తమ తల్లిదండ్రుల అనుమతితో విద్యాసంస్థలకు హాజరు కావచ్చు. అయితే ఇలా హాజరయ్యే విద్యార్థులు కరోనా నుంచి కాపాడుకునేందుకు తగిన నిబంధనలు పాటించాల్సివుంటుంది. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం మొదలైనవి తప్పనిసరిగా పాటించాల్సివుంటుంది. దీనితోపాటు విద్యార్థులు తరగతిగదిలో తగినంత దూరాన్ని పాటిస్తూ కూర్చోవలసి ఉంటుంది. అలాగే విద్యార్థులు పాఠశాలలోకి రాగానే వారికి థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు. 



స్కూళ్లు తిరిగి ప్రారంభించే విషయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

మహారాష్ట్ర: కరోనాకు అత్యధికంగా ప్రభావితమైన ఈ రాష్ట్రంలో సెప్టెంబరు 30 వరకూ విద్యాసంస్థలు మూసివేయాలని నిర్ణయించారు. 

ఉత్తరప్రదేశ్: స్కూళ్లను తెరిచే విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కరోనా కేసులు పెరుగుతున్నందున సెప్టెంబరు 21 వరకూ విద్యాస్థంస్థలు తెరిచేదిలేదని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. 

ఢిల్లీ: స్కూళ్లు ఇప్పట్లో తెరవబోమని ఢిల్లీ సర్కారు తెలిపింది. 

గుజరాత్: దీపావళి వరకూ స్కూళ్లు మూసివేసి ఉంచాలని నిర్ణయించింది. 

మధ్యప్రదేశ్: పాక్షికంగా విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. అయితే తరగతులు నిర్వహించరు. 

పశ్చిమబెంగాల్: కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా స్కూళ్లు మూసివేసి ఉంచనున్నారు. 

బీహార్: అసెంబ్లీ ఎన్నికలు, ఛట్ పూజల అనంతరం విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. 

జార్ఖండ్: సెప్టెంబరు 30 వరకూ విద్యాసంస్థలను మూసివుంచనున్నారు. 

ఛత్తీస్‌గఢ్: రాయపూర్‌తో పాటు 6 పట్టణాల్లో ప్రస్తుతం లాక్‌డౌన్ అమలులో ఉంది. మిగిలిన ప్రాంతాల్లోనూ విద్యాసంస్థలు తెరిచేందుకు అవకాశాలు లేవు. 

కేరళ: అక్టోబరు వరకూ విద్యాసంస్థలు మూసివేసివుంచనున్నారు. 

కర్నాటక: 9 వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ కూడా విద్యాసంస్థలను తెరవకూడదని నిర్ణయించారు. అయితే విద్యార్థులు తమ డౌట్లను క్లియర్ చేసుకునేందుకు వారి విద్యాసంస్థలకు వెళ్లవచ్చు. తరగతులను ఇప్పట్లో నిర్వహించకూడదని ప్రభుత్వ నిర్ణయించింది. 

Updated Date - 2020-09-20T15:52:31+05:30 IST