వర్కుషాపులో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్
గుంటూరు(విద్య), జనవరి 18: పాఠశాలల మ్యాపింగ్ సమర్ధంగా చేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. నూతన విద్యాపాలసీ, విద్యాప్రగతి, జాతీయ నూతన విద్యావిధానం తదితర అంశాలపై ముంగళవారం గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వర్కుషాపులో ఆయన ప్రసంగించారు. 3,4,5 తరగతుల విలీనంలో ఎదురయ్యే సమస్యల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కోరారు. నాడునేడు, అమ్మఒడి తదితర పథకాలు సమర్ధంగా అమలు చేయాలని కోరారు. విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలతో రాష్ట్రంలో ఈ ఏడాది ఏడు లక్షల మంది విద్యార్థులు అదనంగా చేరారన్నారు. సమగ్రశిక్ష రాష్ట్ర అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెట్రిసెల్వీ, విద్యాశాఖ అదనపు డైరెక్టర్లు, ప్రతాప్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, కేవీ శ్రీనివాసులురెడ్డి, దేవానందరెడ్డి, మువ్వా రామలింగం, ఆర్‌జేడీ సుబ్బారావు, డీఈవో ఆర్‌ఎస్ గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.