బడి స్థలం కబ్జా

ABN , First Publish Date - 2022-01-18T06:41:43+05:30 IST

మండలంలోని బుగ్గ సర్కిల్లో ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కబ్జా చేశారు. దాదా పు రూ.60లక్షలు విలువైన 21సెంట్ల స్థలాన్ని కబ్జా చేసినా అధికార యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోం ది.

బడి స్థలం కబ్జా

దాదాపు రూ.60లక్షల విలువైన 21 సెంట్లు ఆక్రమణ

బుగ్గ సర్కిల్లో దారుణం

పట్టించుకోని అధికార యంత్రాంగం

తాడిపత్రిటౌన, జనవరి17: మండలంలోని బుగ్గ సర్కిల్లో ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కబ్జా చేశారు. దాదా పు రూ.60లక్షలు విలువైన 21సెంట్ల స్థలాన్ని కబ్జా చేసినా అధికార యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోం ది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఎంఈఓ పలుమా ర్లు ఫిర్యాదుచేసిన పట్టించుకోవడం లేదు. మిగిలిన 14సెం ట్ల ఖాళీ స్థలాన్ని కూడా ఆక్రమిస్తారేమోనని పాఠశాల ఉ పాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.  బుగ్గసర్కిల్‌  అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల సరిహద్దుగా ఉండడమే కాకుండా ఆసియాలోనే రెండో అతిపెద్ద సిమెంట్‌ ఫ్యాక్టరీ అలా్ట్రటెక్‌కు కూతవేటు దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో భూములకు విపరీతమైన గిరాకీ ఉంది. ఖాళీ స్థలం ఉంటే చాలు హాట్‌కేక్‌ల్లా అమ్ముడుపోతాయి. రోడ్డు పక్కన ఉన్న వాటికి అధికడిమాండ్‌ ఉంటోంది. ఇలాంటి డిమాండ్‌ ఉన్న ప్రాంతంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. దాదాపు 84సెంట్లను ప్రాథమిక పాఠశా ల కోసం కేటాయించారు. ఇందులో 34సెంట్లలో ప్రాథమిక పాఠశాలతోపాటు ప్రహరీ ఉంది. మిగిలిన 50సెంట్లలో 15సెంట్లు సచివాలయం, రైతుభరోసాకేంద్రాలను ఏర్పాటు చేశారు. మిగిలిన 35సెంట్లు కొద్దికాలం క్రితం వరకు ఖాళీగా ఉండేది. ఈ స్థలంపై కొందరు కన్నేసి దాదాపు రూ.45లక్షల విలువైన 15సెంట్లలో అక్రమంగా బండలు పాతి అందులో కొట్టాలు వేశారు. ఈ విషయాన్ని పాఠ శాల ఉపాధ్యాయులు ఎంఈఓ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఆయన తహసీల్దార్‌కు ఫిర్యాదుచేశారు. వీటిని తొలగించేందుకు తహసీల్దార్‌తోపాటు సిబ్బంది ప్రయత్నా లు చేశారు. తమ జోలికి వస్తే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయిస్తామని వారు బెదిరించడంతో  రెవెన్యూ సిబ్బంది తమకెందుకు వచ్చిన తంటా అంటూ వాటిజోలికి వెళ్లలే దు. వీరు కబ్జా చేశారన్న విషయం తెలుసుకున్న ఒక వర్గంవారు అక్కడ గుడి నిర్మాణం కోసం 6సెంట్లు ఆక్ర మించారు. ఈ స్థలంలో జెండాలు పాతి తాత్కాలికంగా ప్రార్థన స్థలాన్ని ఏర్పాటుచేశారు. వీరు ఆక్రమించినా ఏమి చేయలేని అధికారులు తాము ఆక్రమిస్తే అడిగేవారు ఎవ రని కొందరు అధికారపార్టీ మద్దతుదారులు మిగిలిన 14సెంట్ల స్థలంపై కన్నేశారు. ఏ సమయంలోనైనా ఈ స్థలాన్ని కబ్జాచేసేందుకు రంగం సిద్ధం చేశారన్న ప్రచారం ఉంది. భవిష్యతలో స్కూల్‌ విస్తరణ కోసం ఖాళీగా ఉన్న 50సెంట్ల స్థలంలో ఇప్పటికే అధికారులు రైతుభరోసా కేంద్రం, సచివాలయం కోసం 15సెంట్లు ఉపయోగించారు. మిగిలిన స్థలం కూడా కబ్జా అవుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థలం కబ్జాపై ఎంఈఓ నాగరాజు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ఈ విషయాన్ని తహసీ ల్దార్‌, కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లాం. వారు చర్యలు తీసు కొని పాఠశాల స్థలాన్ని కాపాడతారని ఆశిస్తున్నాం.

Updated Date - 2022-01-18T06:41:43+05:30 IST