తెరుచుకున్న బడి తలుపులు

ABN , First Publish Date - 2020-09-22T11:09:37+05:30 IST

కొవిడ్‌ నేపథ్యంలో దాదాపు ఆరునెలలుగా మూతపడిన బడి తలుపులు సోమవారం తెరుచుకున్నాయి. కొవిడ్‌ మార్గదర్శకాల ప్రకారం

తెరుచుకున్న బడి తలుపులు

 నామమాత్రంగా ప్రైవేటు స్కూళ్లు

 పాఠశాలలకు రాని టీచర్లకు 

  గైర్హాజరైనట్లు నమోదు: డీఈవో 


చిత్తూరు  సెంట్రల్‌/తిరుపతి (విద్య), సెప్టెంబరు 21: కొవిడ్‌ నేపథ్యంలో దాదాపు ఆరునెలలుగా మూతపడిన బడి తలుపులు సోమవారం తెరుచుకున్నాయి. కొవిడ్‌ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో 9,10, ఇంటర్‌ తరగతుల విద్యార్థులను సోమవారం నుంచి వారి తల్లిదండ్రుల అనుమతితో పాఠశాలకు పిలిపించుకుని సందేహాలు నివృత్తి చేయవచ్చని ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే.


జిల్లాలో 6,256 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తొమ్మిది, పది తరగతుల్లో 80వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలైతే తెరిచి పెట్టారు కానీ చాలాచోట్ల విద్యార్థులు రాలేదు. వాహన సౌకర్యం, సమీపంలోనే పాఠశాలలున్న వారిలో ఐదు నుంచి 10 శాతం మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు.చాలాచోట్ల పిల్లల తల్లిదండ్రులను రప్పించి కొవిడ్‌పై అవగాహన కల్పించిన టీచర్లు పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా తాము అందుబాటులో వుంటామని భరోసా ఇచ్చారు.


స్కూలుకు రాలేని పిల్లలు పాఠశాలల సమయంలో వచ్చి సందేహాలు తీర్చుకోవచ్చని చెప్పారు.  తిరుపతి డివిజన్‌లో దాదాపు 15వేలమందికిగాను రెండువేల మంది విద్యార్థుల వరకు హాజరైనట్లు డీవైఈవో విజయేంద్రరావు తెలిపారు. ఇక ప్రైవేటు విద్యాసంస్థలైతే నామమాత్రంగా తెరచి ఉంచారే తప్ప, విద్యార్థులె వరూ రాలేదు.దాంతోవారు ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగిం చారు. ఇదిలా ఉంటే.. ఆన్‌లైన్‌, బయోమెట్రిక్‌ లేకపోవడంతో ఉపాధ్యాయుల హాజరు శాతం గణాంకాలు స్పష్టంగా లేవని, బడికి రాని ఉపాధ్యాయులకు గైర్హాజరుగా నమోదు చేసినట్లు డీఈవో నరసింహారెడ్డి తెలి పారు. మంగళవారం నుంచి 50 శాతం మంది ఉపాధ్యాయులు కచ్చితంగా విధులకు హాజరు కావాలని స్పష్టం చేశారు. 

 

కళాశాలల పరిస్థితీ అంతే..

ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో సెకండియర్‌ విద్యార్థులు సుమారు 50వేల మంది చదువుకుంటున్నారు.ఇక్కడా ఎక్కువమంది కళాశా లలకు హాజరు కాలేదని సమాచారం. కరోనా కారణంగా.. కళాశాలకు రావాలంటే భయంగా ఉందని శ్రీకాళహస్తికి చెందిన సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థిని హర్షిత చెప్పా రు. తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చామన్నారు.రవాణా సౌకర్యం సరిగా లేదని..


ఆటోల్లో భౌతిక దూరం పాటించే అవకాశం ఉండదని కేవీబీపురం మండలంలోని ఆదవరానికి చెందిన సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థిని చామంతి అన్నారు. మొత్తానికి కరోనా వైరస్‌ ఉధ్రుతి ఎక్కువగా ఉండటంతో తమ పిల్లలను పాఠశాలలు, కళాశాలలకు పం పడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. 

Updated Date - 2020-09-22T11:09:37+05:30 IST