Hyderabad: సెక్యూరిటీ గార్డ్‌పైకి దూసుకెళ్లిన స్కూలు బస్సు

ABN , First Publish Date - 2022-05-17T17:29:56+05:30 IST

హైదరాబాద్‌లో ఓ స్కూలు బస్సు సెక్యూరిటీ గార్డ్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డ్ గాయపడ్డాడు. పెద్దఅంబర్ పేట్‌లోని కండోర్ షైన్ స్కూల్ బస్సుకు

Hyderabad:  సెక్యూరిటీ గార్డ్‌పైకి దూసుకెళ్లిన స్కూలు బస్సు

Hyderabad: హైదరాబాద్‌లో ఓ స్కూలు బస్సు (School Bus) సెక్యూరిటీ గార్డ్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డ్ గాయపడ్డాడు. పెద్దఅంబర్ పేట్‌లోని కండోర్ షైన్ స్కూల్ బస్సుకు బ్రేకులు ఫెయిలవ్వడంతో సెక్యూరిటీ గార్డ్‌పైకి దూసుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ సెక్యూరిటీ గార్డును వెంటనే ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులు పరీక్ష గదిలోకి వెళ్లిన తర్వాత ఈ ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు ప్రమాదం గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కంగారుపడ్డారు.  

Updated Date - 2022-05-17T17:29:56+05:30 IST