Viral Video: ఇద్దరూ ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారట.. సినిమా రేంజ్‌లో కొట్టుకున్న స్కూల్ విద్యార్థులు!

ABN , First Publish Date - 2022-09-24T17:46:07+05:30 IST

స్కూల్ పిల్లలు బుద్ధిగా బడికి వెళ్లి.. అక్కడ చెప్పిన పాఠాలు విని.. తిరిగి క్రమశిక్షణగా ఇంటికి వచ్చే రోజులు పోయాయి. సినిమాల ప్రభావమో లేక సోషల్ మీడియాల ప్రభావమో తెలియదు కానీ.. స్కూల్ ఏజ్‌లో అమ్మాయిలను చూసి ఆకర్షితులవుతున్నా

Viral Video: ఇద్దరూ ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారట.. సినిమా రేంజ్‌లో కొట్టుకున్న స్కూల్ విద్యార్థులు!

ఇంటర్నెట్ డెస్క్: స్కూల్ పిల్లలు బుద్ధిగా బడికి వెళ్లి.. అక్కడ చెప్పిన పాఠాలు విని.. తిరిగి క్రమశిక్షణగా ఇంటికి వచ్చే రోజులు పోయాయి. సినిమాల ప్రభావమో లేక సోషల్ మీడియాల ప్రభావమో తెలియదు కానీ.. స్కూల్ ఏజ్‌లో అమ్మాయిలను చూసి ఆకర్షితులవుతున్నారు. ఇష్టాన్ని ప్రేమగా భావించి.. దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు షాకవుతున్నారు. 



వీడియోలోని దృశ్యాల ప్రకారం.. తాము ఒకే అమ్మాయిని ఇష్టపడుతున్నట్టు గ్రహించిన ఇద్దరు అబ్బాయిలు(School boys) స్కూల్ ప్రాంగణంలోనే వాగ్వాదానికి దిగారు. ఒకరిపై ఒకరు పిడి గుద్దులు కురిపించుకున్నాడు. ఓ విద్యార్థి మరో విద్యార్థిని కింద పడేసి అతడిని కాలుతో తన్నాడు. అనంతరం అతడిపై కూర్చుని.. తలపై బలంగా కొట్టాడు(brutally fight). ఈ క్రమంలో అక్కడున్న కొందరు విద్యార్థులు వేడుక చూశారు. నవ్వుతూ వాళ్ల గొడవను ఎంజాయ్ చేశారు. మరికొందరేమో ఆ దృశ్యాలను వీడియో తీశారు. విద్యార్థులు ఎక్కడ ఘర్షణకు దిగారన్న విషయంపై స్పష్టత లేకున్నప్పటికీ.. ఈ ఘటన కోల్‌కతాలో చోటు చేసుకున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం వైరల్(viral video) అవుతోంది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు ఆ విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 




Updated Date - 2022-09-24T17:46:07+05:30 IST