వెం‘బడి’స్తున్న సమస్యలు

ABN , First Publish Date - 2021-06-14T05:13:14+05:30 IST

ఒక దేశానికి ఆయువుపట్టు అక్కడి యువతరం. ఆ యువతరం విద్యాబుద్ధులు నేర్చుకునేది ఒక పాఠశాలలో.. ముఖ్యం పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాల పిల్లలు చదివేది ప్రభుత్వ పాఠశాలల్లోనే. కానీ ఆ పాఠశాలలు నేడు సమస్యల నిలయాలుగా మారాయి. ఒకటి కాదు రెండు కాదు ఏళ్లుగా ఇదే దుస్థితి. ఇలాంటి పరిస్థితిలో భావిభారత పౌరులు ఎలా చదువు నేర్చుకుంటారు? భవిష్యత్‌ మార్గనిర్దేశకులు ఎలా అవుతారో ప్రభుత్వానికే తెలియాలి.

వెం‘బడి’స్తున్న సమస్యలు
సుజ్ఞాపురంలో నిర్మాణంలో ఉండగానే శిధిలావస్థకు చేరిన పాఠశాల

వందలకొద్దీ తరగతి గదులు శిథిలావస్థకు 

ప్రహరీగోడ, తాగునీరు లేని బడులు ఎన్నో

జిల్లా విద్యాశాఖకు రఽథసారఽథి కరవు

ఏడీ, 23 ఏంఈవో పోస్టులు ఖాళీ 

భర్తీకి నోచని 732 ఉపాధ్యాయ పోస్టులు

భద్రాచలం, జూన్‌ 13: ఒక దేశానికి ఆయువుపట్టు అక్కడి యువతరం. ఆ యువతరం విద్యాబుద్ధులు నేర్చుకునేది ఒక పాఠశాలలో.. ముఖ్యం పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాల పిల్లలు చదివేది ప్రభుత్వ పాఠశాలల్లోనే. కానీ ఆ పాఠశాలలు నేడు సమస్యల నిలయాలుగా మారాయి. ఒకటి కాదు రెండు కాదు ఏళ్లుగా ఇదే దుస్థితి. ఇలాంటి పరిస్థితిలో భావిభారత పౌరులు ఎలా చదువు నేర్చుకుంటారు? భవిష్యత్‌ మార్గనిర్దేశకులు ఎలా అవుతారో ప్రభుత్వానికే తెలియాలి.

శిథిలావస్థకు చేరాయి

కొన్ని శిథిలావస్థకు చేరాయి. ఇంకొన్ని ఒక మోస్తరు వర్షానికే కూలేలా ఉన్నాయి. ప్రహరీగోడ తాగునీటి సౌకర్యం లేని పాఠశాలలెన్నో.. అసలు విద్యాశాఖను పర్యవేక్షించే డీఈవోతో పాటు, ఏడీ, 23 మండలాలకు ఎంఈవోలే లేరు. కేవలం ఇన్‌చార్జ్‌లతోనే నెట్టుకొస్తున్నారు. రెండేళ్లుగా కరోనా వల్ల ఆన్‌లైన్‌ చదువులు సాగుతుండటం, ప్రభుత్వం పరీక్షలు రద్దు చేయడంతో ప్రభావం అంతగా కన్పించడం లేదు కానీ.. గతంలో మాదిరి ఉంటే మాత్రం పరిస్థితులు వేరే విధంగా ఉండేవి. ఇక జిల్లాలో వందల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా వాటి భర్తీపై ప్రభుత్వం దృష్టిసారించడం లేదు. నూతన విద్యా సంవత్సరం ఆరంభమవుతున్న తరుణంలో అనేక రకాల సమస్యలు ప్రభుత్వ పాఠశాలలను పట్టిపీడిస్తున్నాయి. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల తరగతి గదులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. జిల్లాలో 128 తరగతి గదులు శిధిలావస్థకు చేరాయి. అత్యవసరంగా మరమ్మతులు చేయాల్సిన తరగతి గదులు 395 వరకు ఉన్నాయి. 36 పాఠశాలలకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదు. ప్రహరీ గోడలు లేని పాఠశాలలు 367, మరుగుదొడ్లు సవ్యంగా లేని పాఠశాలలు ఎన్నో. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యాబోధన ఏ విధంగా ప్రభుత్వానికే తెలియాలి. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం. ఈ సమయంలో భారీ వర్షాలతో శిఽథిలావస్థలో ఉన్న తరగతి గదులు, .అత్యవసరంగా మరమ్మతులు చేపట్టాల్సిన తరగతి గదులు వర్షాలతో నాని కూలేం దుకు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ముందుగా జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలపై ఇప్పటికే ఒక అధికారిక సర్వే క్షేత్రస్థాయిలో నిర్వహించి ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి సైతం నివేదించినట్లు తెలిసింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం పట్ల సర్వత్రా ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లా విద్యాశాఖకు రథసారఽథి కరువు

విద్యాశాఖకు రఽథసారఽథి ఉంటేనే క్షేత్రస్థాయిలో పూర్తి పర్యవేక్షణ ఉంటుంది. ఉపాధ్యాయుల పనితీరుపై మరింత పర్యవేక్షణ ఉండే అవకాశం ఉంది. కాని దురదృష్టవశాత్తు జిల్లా విద్యాశాఖ అధికారి పోస్టు గత కొంత కాలంగా ఖాళీగానే ఉండటంతో మహబూబాబాద్‌ జిల్లా విద్యాశాఖ అధికారి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జిల్లా విద్యాశాఖలో కీలకమైన ఏడీ పోస్టు సైతం కొంత కాలంగా ఖాళీగానే ఉంది. జిల్లాలోని 23 మండలాలకు పూర్తిస్థాయిలో ఎంఈవోలు లేకపోవడంతో మండల విద్యా వ్యవస్థ గాడి తప్పిందని చెప్పక తప్పదు. ఇన్‌చార్జ్‌ ఎంఈవోలు పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక ఉపాధ్యాయ పోస్టులు జిల్లాలో ఖాళీగానే ఉన్నాయి. జిల్లాలో 732 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బయాలజీ, మ్యాథ్స్‌, ఇంగ్లీషు, సోషల్‌ స్టడీస్‌తో పాటు ఇతర పోస్టులు భారీగా ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీ కోసం చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులు ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వంకు నివేదించినా ఎటువంటి ఫలితం లేదని తెలుస్తోంది. 

విద్యార్ధులు లేని పాఠశాలలు 13

జిల్లాలో విద్యార్ధులు లేని పాఠశాలలు 13 ఉన్నాయి. పది మంది విద్యార్థులున్న పాఠశాలలు 55, 25 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలు 193, 50లోపు విద్యార్థులున్న పాఠశాలలు 484, వందలోపు విద్యార్ధులున్న పాఠశాలలు 194, వందకు పైగా విద్యార్ధులున్న పాఠశాలలు 123 ఉన్నాయి. అయితే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో విద్యార్థుల్లేని పాఠశాలలను తొలగించి వాటిని సమీపంలోని పాఠశాలల్లో విలీనం చేస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. 

సమస్యలపై ప్రభుత్వానికి నివేదించాం

సోమశేఖర శర్మ, ఇన్‌చార్జి జిల్లా విద్యాశాఖ అధికారి

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలై ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన వెంటనే పనులు చేపడతాం. పోస్టుల ఖాళీపై ప్రభుత్వానికి నివేదిక పంపాం. ప్రభుత్వ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటాం. 

Updated Date - 2021-06-14T05:13:14+05:30 IST