పోటీ పరీక్షల కోచింగ్ సంస్థ ‘టైమ్’... గేట్-2013 అభ్యర్థుల కోసం ఈనెల 15న ఆన్‌లైన్‌లో ‘గేట్ క్వెస్ట్’ స్కాలర్‌షిప్(Scholarship Test)ని నిర్వహిస్తోంది. పరీక్ష వ్యవధి ఒక గంట. ప్రశ్నలు మట్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. మొత్తం 40 ప్రశ్నలు ఇస్తారు. క్వాంటిటేటివ్ ఎబిలిటీ, డేటా ఇంట్రప్రిటేషన్, వెర్బల్ ఎబిలిటీ, కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్(బేసిక్ సబ్జెక్ట్) నుంచి ప్రశ్నలు అడుగుతారు. నెగెటివ్ మార్కింగ్ లేదు. పరీక్షలో ప్రతిభ చూపిన వారికి గేట్-2023 కోచింగ్ ఫీజులో ప్రత్యేక డిస్కౌంట్ లభిస్తుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు కింద ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ లింక్: https://www.time4education.com/local/articlecms/page.php?id=4584