పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-05-20T06:09:56+05:30 IST

రాష్ట్రం ప్రభుత్వం పాల రైతులకు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికపరిపుష్టి సాధించాలని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
మంత్రిని సన్మానిస్తున్న కృష్ణారెడ్డి

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

నల్లగొండ, మే 19: రాష్ట్రం ప్రభుత్వం పాల రైతులకు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికపరిపుష్టి సాధించాలని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. నార్మూల్‌ డెయిరీ పాల ఉత్పత్తిదారులకు లీటర్‌కు రూ.3చొప్పున మొత్తం రూ.20.20కోట్లు మంజూరు చేసినందుకు గురువారం మదర్‌ డెయిరీ చైర్మన్‌ గంగుల కృష్ణారెడ్డి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మద ర్‌ డెయిరీ చైర్మన్‌ గంగుల కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పాడి పశువుల పంపిణీ పథకం ద్వారా 13,983 మంది రైతులకు సబ్సిడీపై పశువులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ పథకం కింద కొనుగోలు చేసిన 770 పశువులు మృత్యువాత పడినందున వాటి స్థానంలో తిరిగి పశువులను ఇవ్వనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి జగదీ్‌షరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మదర్‌ డెయిరీ ఎండీ వి. అశోక్‌కుమార్‌, డీజీఎం బి. కృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-20T06:09:56+05:30 IST