పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-06-30T06:05:09+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ట్రాన్స్‌జెండర్స్‌ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు.

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌

కలెక్టర్‌ కోటేశ్వరరావు

 కర్నూలు(కలెక్టరేట్‌), జూన్‌ 29: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ట్రాన్స్‌జెండర్స్‌ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ట్రాన్స్‌జెండర్స్‌ అవగాహన కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జిల్లా లీగల్‌ సర్వీస్‌ అథారిటీ సెక్రటరీ నాగ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలకు అందిస్తున్న సం క్షేమ పథకాలన్నీ ట్రాన్స్‌జెండర్స్‌కు కూడా వర్తిస్తాయని తెలిపారు. జిల్లాలో 218 ట్రాన్స్‌జెండర్స్‌కు పింఛన్లు ఇస్తున్నామని, ఇంకా పింఛన్‌ రాని వారు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రేషన్‌, ఆధార్‌ కార్డు కలిగి ఉంటే ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. రేషన్‌కార్డు లేనివారికి మంజూరు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. జిల్లా లీగల్‌ సర్వీస్‌ అథారిటీ సెక్రటరీ నాగ శ్రీనివాసరావు మాట్లాడుతూ చాలా మంది తల్లిదండ్రులు ట్రాన్స్‌జెండర్స్‌ను వదిలేయడం బాధాకరమన్నారు. విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహా య సంచాలకులు విజయ మాట్లాడుతూ 150 మంది ట్రాన్స్‌ జెండర్స్‌ ఉన్నారని, వీరందరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరారు. అనంతరం ట్రాన్స్‌జెండర్స్‌కు ఐడీ కార్డులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా లీగల్‌ సర్వీస్‌ అథారిటీ కార్యదర్శి నాగశ్రీనివాసరావు, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌, డీఆర్‌డీఏ ఎల్‌డీఎం వెంకటనారాయణ పాల్గొన్నారు.



Updated Date - 2022-06-30T06:05:09+05:30 IST