సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చర్యలు

ABN , First Publish Date - 2020-12-05T03:48:25+05:30 IST

సంక్షేమ పథకాలు అర్హులకే అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు.

సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చర్యలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

-కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌, డిసెంబరు4: సంక్షేమ పథకాలు అర్హులకే అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎంపీ డీవోలు, ఎంపీవోలు, ట్రైబల్‌, డీఆర్‌డీఏ, ఆర్‌అండ్‌బీ, పీఆర్‌ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామం పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలన్నారు. ప్రతి పని పేపర్‌ మీద కాకుండా క్షేత్రస్థాయిలో ఉండాలని సూచిం చారు. పల్లె ప్రకృతివనాలు, డంపింగ్‌యార్డు, రైతు వేదికలు తదితర పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. అధికారులు పనుల స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలించాల న్నారు. అన్ని పనులు డిసెంబరు 31 నాటికి పూర్తి చేసి జనవరి 31 నాటికి యూటిలైజేషన్‌ చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ రాంబాబు, డీఆర్‌వో సురేష్‌, డీఆర్‌డీఏ, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఆర్‌అండ్‌బీ, పీఆర్‌ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-05T03:48:25+05:30 IST