Abn logo
Sep 25 2021 @ 01:14AM

స్కీం వర్కర్ల సమ్మె విజయవంతం

జిల్లాపరిషత్‌ సెంటర్‌వద్ద ధర్నా చేస్తున్న దృశ్యం

భానుగుడి(కాకినాడ), సెప్టెంబరు 24: కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వ పథకాల్లో సేవలందిస్తున్న స్కీం వర్కర్ల సమస్యలు పరి ష్కారం చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ అనుబంధ స్కీంవర్కర్లు పిలుపునిచ్చిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ర్యాలీ విజయవంతమైంది. కాకినాడ హెడ్‌ పోస్టా ఫీసునుంచి మెయిన్‌రోడ్డు మీదుగా, జిల్లా పరిషత్‌ సెంటర్‌ వరకూ ర్యాలీ చేపట్టారు. అనంతరం జిల్లా పరిషత్‌ సెంటర్‌వద్ద నిరసన తెలిపారు. సీఐటీయూ సీనియర్‌ నేత దువ్వశేషు బాబ్జి, అంగన్‌వాడీవర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధా న కార్యదర్శి ఈ.చంద్రావతి, ఆశావర్కర్స్‌ నా యకులు భారతి, వీఓఏ యానిమేటర్స్‌ నాయ కురాలు మేరి మధ్యాహ్నభోజన పథకం నా యకురాలు మునికాంతం, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్‌ మా ట్లాడుతూ స్కీంవర్కర్లపట్ల కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు నిర్లక్ష్యవైఖరి వీడనాడాలన్నారు. కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలవల్ల సామాన్యుల కు మేలు జరుగుతుందని, ప్రభుత్వ పథకాలకు  బడ్జేట్‌ కేటాయింపులు తగ్గించడం దారుణమన్నారు. ఒకపక్కన ప్రభుత్వ పథకాల్లో వర్క్‌ర్లు అందరినీ సంక్షేమ పథకాల జాబితానుంచి తొలగించడం బాధకరమన్నారు. కనీస వేత నాలు, రిటైర్‌మెంట్‌ బెన్‌ఫిట్స్‌, పెన్షన్‌ అడిగితే స్కీం వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్మిక కోడ్‌లు రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రాజకీయ వేధింపులు ఆపాలన్నారు.