Abn logo
Sep 25 2021 @ 00:33AM

ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని స్కీమ్‌ వర్కర్‌లు ధర్నా

గాజువాక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న స్కీమ్‌ వర్కర్‌లు

గాజువాక, సెప్టెంబరు 24: అంగన్‌వాడీ, ఆశా వర్కర్‌లు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం గాజువాక తహసిల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలని, పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలని, కొవిడ్‌తో మృతి చెందిన వారికి రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేంద్రప్రసాద్‌, జి.లక్ష్మి, కిరీటం, విజయ్‌, చిన్నమ్మలు, జ్యోతి, వరలక్ష్మి పాల్గొన్నారు.