బదిలీలు, పదోన్నతుల షెడ్యుల్‌ విడుదల చేయాలి

ABN , First Publish Date - 2022-07-03T05:59:50+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యుల్‌ను వెంటనే విడుదల చేయాలని ఉపా ధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ రామారావు డిమాండ్‌ చేశారు.

బదిలీలు, పదోన్నతుల షెడ్యుల్‌ విడుదల చేయాలి
సూర్యాపేటలో మాట్లాడుతున్న ఉపాధ్యాయ సంఘాల నాయకుడు రామారావు

సూర్యాపేట అర్బన్‌, జూలై 2: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యుల్‌ను వెంటనే విడుదల చేయాలని ఉపా ధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ రామారావు డిమాండ్‌ చేశారు. జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఏడేళ్లుగా పదోన్నతులు లేక, ఖాళీలు భర్తీకాక విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. జీవో 317అమలు కారణంగా ఏర్పడిన సీనియార్టీ, స్పెషల్‌ క్యాటగిరి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఇంగ్లీష్‌ మీడియం బోధన కోసం ప్రత్యేకంగా అదనపు ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలన్నారు. పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు సరఫరా చేయాలన్నారు. జూలై 7న హైదరాబాద్‌లో జరిగే మహాధర్నా కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణారెడ్డి, సోమయ్య, సయ్యద్‌, యాదగిరి, బిక్షపతి, యాకయ్య, వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు. 

కోదాడటౌన్‌/ కోదాడ రూరల్‌: విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని టీపీటీఎఫ్‌ మండల అధ్యక్షుడు బడుగుల సైదులు అన్నారు. శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యాయుల పదోన్నతులు కేవలం ఉపాధ్యాయుల సమస్య మాత్రమే కాదని విద్యా ర్థులకు సంబంధించి కూడా ఉందన్నారు. పదోన్నతులతో ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీరి, విద్యా ప్రమాణాలు మెరుగు పడతాయన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులకు నాలుగేళ్లుగా బదిలీలు, ఏడేళ్లుగా పదోన్నతలు లేవన్నారు. సమస్యలు పరిష్కరించాలన్నారు. 

సూర్యాపేట అర్బన్‌: పాఠశాల విద్యాశాఖలో దీర్ఘకాలంగా అపరిషృతంగా ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి హైదరాబాద్‌లోని విద్యాశాఖ సంచాలకుల కార్యాలయాల ముట్టడిని విజయవంతం చేయాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త నాయకులు మట్టపల్లి రాధాకృష్ణ కోరారు. జిల్లాకేంద్రంలో టీపీటీయూ జిల్లా అధ్యక్షుడు భూపతి శ్రీనివాస్‌ అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాల న్నారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, శంకర్‌రావు, రూప్లానాయక్‌, నాగ య్య, రమేష్‌, శ్రీను, శ్రీనివాస్‌, కృష్ణ, రామకృష్ణ, ఉపేందర్‌ ఉన్నారు. 

Updated Date - 2022-07-03T05:59:50+05:30 IST