పదోన్నతి, బదిలీల షెడ్యూల్‌ను విడుదల చేయాలి

ABN , First Publish Date - 2022-08-14T05:02:55+05:30 IST

ఉపాధ్యాయుల పదోన్నతి, బదిలీల షెడ్యూల్‌ వెంటనే విడుదల చేయాలని స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌(ఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు సదానందగౌడ్‌ డిమాండ్‌ చేశారు.

పదోన్నతి, బదిలీల షెడ్యూల్‌ను విడుదల చేయాలి
మాట్లాడుతున్న ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందగౌడ్‌

సంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 13: ఉపాధ్యాయుల పదోన్నతి, బదిలీల షెడ్యూల్‌ వెంటనే విడుదల చేయాలని స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌(ఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు సదానందగౌడ్‌ డిమాండ్‌ చేశారు. సంగారెడ్డిలోని టీఎన్జీవో్‌సభవన్‌లో శనివారం ఎస్టీయూటీఎస్‌ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు సదానందగౌడ్‌ మాట్లాడుతూ.. పదోన్నతులు, బదిలీలు చేపట్టడంలో జాప్యం చేయడం సరికాదన్నారు.  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతరెడ్డి మాట్లాడుతూ 317 జీవో అప్పీళ్లను పరిష్కరించకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు భుజంగరావు, జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌సాబేర్‌ అలీ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఉపాధ్యాయుల పక్షపాతిగా సంఘం పని చేస్తున్నదన్నారు. అంతకుముందు సంఘం పూర్వ బాధ్యులను సన్మానించగా, స్థానిక ఎస్టీయూ భవన్‌ నుంచి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సంఘం జిల్లా సావనీర్‌ను విడుదల చేశారు. జిల్లా అధ్యక్షుడు సాబేర్‌ అలీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివా్‌సరాథోడ్‌, మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు సుమన్‌లత, వాణి, భారతి, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, హెడ్‌ క్వార్టర్‌ సెక్రటరి పోలిరెడ్డి, మెదక్‌ జిల్లా అధ్యక్షుడు ప్రణీత్‌, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు భూపాల్‌, మెదక్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజగోపాల్‌గౌడ్‌, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి రమేశ్‌కుమార్‌, జిల్లా ఆర్థిక కార్యదర్శి రమణకుమార్‌, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-14T05:02:55+05:30 IST