డీఎల్‌ఎడ్‌ సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూల్‌ ఖరారు

ABN , First Publish Date - 2021-05-12T06:03:13+05:30 IST

డీఎల్‌ఎడ్‌ (2019–21 బ్యాచ్‌) 2, 3, 4 సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేసినట్టు డీఈవో సీవీ రేణుక తెలిపారు.

డీఎల్‌ఎడ్‌ సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూల్‌ ఖరారు

ఏలూరు ఎడ్యుకేషన్‌, మే 11: డీఎల్‌ఎడ్‌ (2019–21 బ్యాచ్‌) 2, 3, 4 సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేసినట్టు డీఈవో సీవీ రేణుక తెలిపారు. రెండో సెమి స్టర్‌ పరీక్షలు జూన్‌ 21 నుంచి 24 వరకు, మూడో సెమిస్టర్‌ పరీక్షలు జూలై 12 నుంచి 17వ తేదీ వరకు, నాల్గవ సెమిస్టర్‌ పరీక్షలు ఆగస్టు 23 నుంచి 26 వరకు జరుగుతాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ దరఖాస్తులను www.bse.ap.gov వెబ్‌సైట్‌లో ఈనెల 19వ తేదీ నుంచి అప్‌లోడ్‌ చేసుకోవా లని సూచించారు. పరీక్షలు ఉదయం 9 నుంచి 11.30  వరకు జరుగుతాయన్నారు. 


Updated Date - 2021-05-12T06:03:13+05:30 IST