బాలికపై రేప్‌ కేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ పూర్తి

ABN , First Publish Date - 2022-06-12T21:22:14+05:30 IST

హైదరాబాద్‌: బాలికపై రేప్‌ కేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ ముగిసింది. జువైనల్ హోమ్ డ్రెస్ కోడ్‌తో క్రైమ్ సీన్‌కి నిందితులను పోలీసులు తీసుకెళ్లారు.

బాలికపై రేప్‌ కేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ పూర్తి

హైదరాబాద్: బాలికపై రేప్‌ కేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ ముగిసింది. జువైనల్ హోమ్ డ్రెస్ కోడ్‌తో క్రైమ్ సీన్‌కి నిందితులను పోలీసులు తీసుకెళ్లారు. కేబీఆర్ పార్క్, కాన్సు బేకరీ, పెద్దమ్మ తల్లి గుడి వెనుక భాగం, ఆమ్నిషియా పబ్ దగ్గర సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. ఏ సీన్‌లో కూడా నిందితులను పోలీసులు కిందకు దించలేదు. నాలుగు ప్రాంతాల్లో సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ ముగిసింది. సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ తర్వాత జూబ్లీహిల్స్ పీఎస్‌లో సాదుద్దీన్‌తో పాటు మైనర్లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో బాలిక మెడికల్ రిపోర్ట్ కీలకంగా మారింది. బాలిక శరీరంపై 12 గాయాలు ఉన్నట్లు మెడికల్ రిపోర్ట్‌లో వైద్యులు తెలిపారు.

Updated Date - 2022-06-12T21:22:14+05:30 IST