Manuguru ఏరియాలో ఎస్‌ఎంపీ అడిట్‌ కమిటీ పర్యటన

ABN , First Publish Date - 2022-01-15T17:30:49+05:30 IST

మణుగూరు ఏరియాలో సేఫ్టీ మెనేజ్‌మెంట్‌ ప్లాన్‌ అడిటింగ్‌ కమిటీ కన్వీనర్‌, జీఎం(క్వాలిటీ కొత్తగూడెం రీజియన్‌) ఎ.రవికుమార్‌ ఆధ్వర్యంలో కమిటీ బృందం శుక్రవారం పర్యటించింది. ఇందులో బాగంగా ఏరియాలోని పీకేఓసీ

Manuguru ఏరియాలో ఎస్‌ఎంపీ అడిట్‌ కమిటీ పర్యటన

మణుగూరుటౌన్‌(భద్రాద్రి కొత్తగూడెం): మణుగూరు ఏరియాలో సేఫ్టీ మెనేజ్‌మెంట్‌ ప్లాన్‌ అడిటింగ్‌ కమిటీ కన్వీనర్‌, జీఎం(క్వాలిటీ కొత్తగూడెం రీజియన్‌) ఎ.రవికుమార్‌ ఆధ్వర్యంలో కమిటీ బృందం శుక్రవారం పర్యటించింది. ఇందులో బాగంగా ఏరియాలోని పీకేఓసీ గనిని సందర్శించి ఎస్‌ఎంపీ పనితీరును పరిశీలించారు. గని ఆవరణలో, పని ప్రదేశాల్లో అవలంభిస్తోన్న రక్షణ నిబంధనలను పరిశీలించారు. అనంతరం పీకేఓసీ ప్రాజెక్‌ కార్యాలయంలో ప్రాజెక్ట్‌ అధికారి లక్ష్మీపతిగౌడ్‌ ఆద్వర్యంలో సమీక్ష సమా వేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్‌ఎంపీ కమిటీ కన్వీనర్‌ రవికుమార్‌ మాట్లాడారు. ఏదైన ప్రమాదాన్ని, విపత్తును ముందస్తుగానే గుర్తించి నివారణోపాయం రచించి అమలు చేయాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రమదాల నివారణే లక్ష్యంగా ఎస్‌ఎంపీని అమలు చేయాలని సూచించారు. పీకేఓసిలో రక్షణ పనితీరు ఏరియాలోని ఇతర గనులకు గీటురాయిలు ఉండాలని ఆకాంక్షించారు. కాంట్రాక్ట్‌ కార్మికుల తోపాటు ఓబి కార్మికులు, కోల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికులు, డ్రైవర్‌లకు సేఫ్టీ ఆపరేషన్‌ ప్రొసిజర్‌పై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్‌ ఫిట్జ్‌లార్డ్‌, రక్షణ అధికారి రమణ, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ రాముడు, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ వీరభద్రుడు, అధికారులు రాంబాబు, దేవసాని శ్రీనివాస్‌, లింగబాబు, నర్సిరెడ్డి, రాజశేఖర్‌, ఎస్‌ఎంపీ కమిటీ సభ్యులు శ్రీనివాస్‌, కమల్‌ కుమార్‌, భూషణ్‌, వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-15T17:30:49+05:30 IST