మరో 48 గంటల్లో అండమాన్‌కు ‘నైరుతి’

ABN , First Publish Date - 2022-05-15T08:36:51+05:30 IST

హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతం వైపు బలంగా రుతుపవన గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో దక్షిణ అండమాన్‌ సముద్రం, దాని

మరో 48 గంటల్లో అండమాన్‌కు ‘నైరుతి’

నేడు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు


విశాఖపట్నం, మే 14(ఆంధ్రజ్యోతి): హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతం వైపు బలంగా రుతుపవన గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో దక్షిణ అండమాన్‌ సముద్రం, దాని పరిసరాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఉత్తర కోస్తా పరిసరాల్లో సముద్ర మట్టానికి 1.5 కి.మీ. నుంచి 5.8 కి.మీ. మధ్యన ఉపరితల ఆవర్తనం ఉంది. ఇంకా అరేబియా సముద్రం నుంచి దక్షిణాది రాష్ట్రాలపైకి తేమగాలులు వీస్తున్నాయి. వీటన్నింటి ప్రభావంతో శనివారం రాయలసీమ, కోస్తాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. మిగిలిన ప్రాంతాల్లో ఉక్కపోత, ఎండ తీవ్రత కొనసాగాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమ, కోస్తాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

Updated Date - 2022-05-15T08:36:51+05:30 IST