విద్యాసంస్థల్లో వడివడిగా ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-01-25T05:19:39+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో విద్యా సంస్థల పునఃప్రారంభానికి రెండు జిల్లాల అధికారులు సన్నద్ధమవుతున్నారు. పాఠశాలల నుంచి పీజీ కళాశాలల వరకు శానిటైజ్‌ చేస్తున్నారు. నిబంధనల మేరకు వసతి గృహాలను నడిపించేందుకు సిద్ధమవుతున్నారు.

విద్యాసంస్థల్లో వడివడిగా ఏర్పాట్లు
కోటగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శానిటైజ్‌ చేస్తున్న దృశ్యం

ఉమ్మడి జిల్లాలో ఫిబ్రవరి ఒకటి నుంచి విద్యాసంస్థల పునఃప్రారంభం

9 నుంచి పీజీ వరకు మొదలు కానున్న రెగ్యులర్‌ తరగతులు

ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

అన్ని విద్యా సంస్థల్లో శానిటైజేషన్‌

నిజామాబాద్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో విద్యా సంస్థల పునఃప్రారంభానికి రెండు జిల్లాల అధికారులు సన్నద్ధమవుతున్నారు. పాఠశాలల నుంచి పీజీ కళాశాలల వరకు శానిటైజ్‌ చేస్తున్నారు. నిబంధనల మేరకు వసతి గృహాలను నడిపించేందుకు సిద్ధమవుతున్నారు. గడిచిన నాలుగు రోజుల నుంచి అధ్యాపకులు, ఇతర సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఫిబ్రవరి ఒకటి నుంచి రెగ్యులర్‌ తరగతులను నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పా ట్లు చేస్తున్నారు. విద్యా సంస్థల్లో సిబ్బంది కొరత ఉన్నా.. తరగతులు మొదలైన తర్వాత విద్యావలంటీర్‌లు, గెస్ట్‌ లెక్చరర్‌లను నియమించేందుకు ప్ర భుత్వ గైడ్‌లైన్స్‌ ప్రకారం సన్నద్ధం అవుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా పరిధిలో ఫిబ్రవరి ఒకటి నుంచి విద్యాసంస్థల్లో తరగతులను ప్రారంభిస్తున్నారు. 

9వ తరగతి నుంచి పీజీ వరకు

పాఠశాల స్థాయిలో 9, 10 తరగతుల నుంచి పీజీ త రగతుల వరకు మొదట నిర్వహించనున్నారు. కరోనా కే సుల సంఖ్యను బట్టి ఆ తర్వాత కిందిస్థాయి తరగతులను కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిఽధిలో అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 9, 10 తరగతులు నిర్వహించే విధంగా తరగతి గదులను సి ద్ధం చేస్తున్నారు. గదులను కడగడంతో పాటు ప్రతీ క్లాస్‌రూంను శానిటైజ్‌ చేస్తున్నారు. తాగునీటి వసతి, మరుగుదొడ్ల సౌకర్యం కల్పిస్తున్నారు. విద్యార్థులకు వసతి గృహాలలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు విద్యాసంస్థలను కూడా నిర్వహించనున్నారు. గురుకుల పాఠశాలలన్నింటినీ తెరవనున్నా రు. వీటిలో కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని జూనియర్‌ కళాశాలలను తెరవనున్నారు. ఇ ప్పటికీ ఆయా కళాశాలల పరిధిలో అధ్యాపకులు తరగతి గ దులను సిద్ధం చేస్తున్నారు. 

ఉమ్మడి జిల్లాలో 141 డిగ్రీ, పీజీ కళాశాలలు

ఉమ్మడి జిల్లా పరిధిలో డిగ్రీ కళాశాలలు 126 ఉన్నాయి.  పీజీ కళాశాలలు 15 ఉన్నాయి. వీటి పరిధిలో రెగ్యులర్‌ తరగతులు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా రు. అలాగే నిజామాబాద్‌ జిల్లా పరిధిలో మొత్తం 98 ప్రభు త్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 50 వరకు ప్రభుత్వ కళాశాలలు అన్ని సొసైటీలవి కలుపుకొని ఉన్నాయి. వీటిలో గురుకుల విద్యాసంస్థలూ ఉన్నాయి. వాటన్నింటినీ సిద్ధం చేస్తున్నారు. జూనియర్‌ కళాశాలల స్థాయి లో ఉదయం సెకండ్‌ ఇయర్‌, మధ్యాహ్నం మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు నిర్వహించే విధంగా చర్య లు చేపట్టారు. డిగ్రీ, పీజీ తరగతులను కూడా అదే విధంగా నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిఽధిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో కూడా అన్ని విభాగా ల్లో తరగతులను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇ ప్పటి వరకు ఆన్‌లైన్‌ తరగతులకే పరిమితమైన అధ్యాపకు లు నేరుగా తరగతులను నిర్వహించనున్నారు. మే వరకు జూనియర్‌ కళాశాల తరగతులను నిర్వహించనుండగా జూ లై వరకు డిగ్రీ కళాశాలలు తరగతులు జరగనున్నాయి. ప్ర భుత్వ ఆదేశాలకు అనుగుణంగా వీటన్నింటిలో శానిటైజ్‌ చేస్తున్నారు. ఈనెల 27 నుంచి 29 వరకు వీటిని ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. తరగతులను కొవిడ్‌  ని బంధనలకు అనుగుణంగా నిర్వహించే విధంగా అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు.

పది నెలల తర్వాత తరగతుల నిర్వహణ

కరోనా కారణంగా పది నెలలుగా విద్యా సంస్థలు తెరుచుకోలేదు. మార్చి 25 తర్వాత తరగతులన్నీ నిలిపివేసి వి ద్యాసంస్థలను మూసివేశారు. ఈ అకాడమిక్‌ ఇయర్‌లో కేవలం ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ చేస్తున్నారు. పరీక్షలను నిర్వహిస్తున్నారు. పది నెలల తర్వాత రెగ్యులర్‌ తరగతులు నిర్వహిస్తున్నందున సిలబస్‌కు అనుగుణంగా తరగతులను నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉన్న సమయంలోనే విద్యార్థులకు మెరుగ్గా క్లాసులు చెప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సిబ్బంది అందరూ హాజరయ్యే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ప్ర భుత్వ షెడ్యూల్‌కు అనుగుణంగానే తరగతుల నిర్వహణ చే పడుతున్నారు. పది నెలల తర్వాత తరగతులు ప్రారంభమవుతున్నందున తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయం పైననే ని ర్వహణ ఆధారపడి ఉంది. పిల్లలు ఎంత మంది వచ్చినా త రగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఆన్‌లైన్‌ క్లాసులు కూడా కొనసాగించనున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పంపిస్తే ఎక్కువ మంది హాజరయ్యే అవకాశం ఉంది. 

అధ్యాపకుల ఖాళీలపై దృష్టి

ఉమ్మడి జిల్లా పరిధిలో పాఠశాలల నుంచి పీజీ కళాశాలల వరకు అధ్యాపకుల ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ విశ్వవిద్యాలయంలో కూడా ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. తరగతులు ప్రారంభమైన తర్వాత వీటిపై నిర్ణయం తీసుకోవాల ని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. అవసరమున్న మేరకు విద్యావలంటీర్‌లను, గెస్ట్‌ లెక్చరర్‌లను నియమించాలని కో రారు. తరగతులు ప్రారంభమైన 15 రోజుల తర్వాత వీటిపై దృష్టిపెట్టనున్నారు. చాలా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఈ మ ధ్య కాలంలో ఎక్కువ మంది అధ్యాపకులు పదవీ విరమణ పొందారు. వారి స్థానంలో ఈ కొత్తవారిని నియమించే అవ కాశం ఉంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి ఒడ్డెన్న తెలిపారు. అన్ని తరగతి గ దులను శానిటైజ్‌ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఫిబ్రవ రి ఒకటో తేదీ నుంచి మొదలయ్యే తరగతులకు ఎంత మం ది విద్యార్థులు హాజరవుతారో.. తల్లిదండ్రులు ఎం తమందిని పంపిస్తారో తేలే అవకాశం ఉందని ఆయన అన్నారు. 

Updated Date - 2021-01-25T05:19:39+05:30 IST