స్కానింగ్‌ ఫీజు రూ.2వేలే

ABN , First Publish Date - 2021-05-17T05:44:01+05:30 IST

కరోనా వ్యాధి తీవ్రతను అంచనా వేయడానికి ఇక నుంచి స్కానింగ్‌ ఫీజు రూ.2వేలు మాత్రమే తీసుకునేందుకు సంబంధిత యాజమాన్యాలు అంగీకరించినట్లు కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్‌ ఆదివారం తన చాంబర్‌లో ఐఎంఏ ప్రతినిధులు, స్కానింగ్‌ సెంటర్‌ల యజమానులతో సమావేశం నిర్వహించారు.

స్కానింగ్‌ ఫీజు రూ.2వేలే
స్కానింగ్‌ సెంటర్‌ల యజమానులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

కలెక్టర్‌ సమావేశంలో అంగీకరించిన స్కానింగ్‌ సెంటర్ల యజమానులు
నిజామాబాద్‌ అర్బన్‌, మే 16: కరోనా వ్యాధి తీవ్రతను అంచనా వేయడానికి ఇక నుంచి స్కానింగ్‌ ఫీజు రూ.2వేలు మాత్రమే తీసుకునేందుకు సంబంధిత యాజమాన్యాలు అంగీకరించినట్లు కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్‌ ఆదివారం తన చాంబర్‌లో ఐఎంఏ ప్రతినిధులు, స్కానింగ్‌ సెంటర్‌ల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాధి తీవ్రతను, ఇతర వ్యాధులను ధ్రువీకరించేందుకు స్కానింగ్‌ సెంటర్ల యాజమాన్యాలు రూ.4వేల నుంచి రూ. 5వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని వారి దృష్టికి తీసుకువచ్చారు. అయితే, కరోనా వైరస్‌ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మా నవతా దృక్పథంతో ఆ ఫీజును రూ.2వేలకు పరిమితం చేయాలని, ఫిలింతో పా టు రిపోర్ట్‌ను కూడా బాధితులకు అందించాలని కోరగా.. అందుకు సంబంధిత యాజమాన్యాలు, వైద్యులు అంగీకరించారని కలెక్టర్‌ తెలిపారు. అదేవిధంగా జి ల్లాలో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌లు, ఆక్సిజన్‌ అవసరం మేరకు సరఫరా జరిగేవిధం గా చర్యలు తీసుకుంటున్నామని, తద్వారా జిల్లాలో వీటి కొరత లేదన్నారు. వీటి వినియోగంపై సంబంధిత ఆసుపత్రుల యాజమాన్యాలు అన్ని వివరాలు అంది ంచి ఇండెంట్‌ పెట్టి వాటిని తీసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా ప్రాణాలను కాపాడే వెంటిలేటర్‌, ఆక్సిజన్‌తో రోగులకు చికిత్స అందించినపుడు ఫీజులు తీసుకునే సమయంలో కూడా కొంత మానవత్వాన్ని దృష్టిలో పెట్టుకోవాలని, ప్రజలు గుర్తుచుకుంటారని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా వై ద్య ఆరోగ్యశాఖ అధికారి బాలనరేంద్ర, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జీవన్‌రావు, రవీంద్రనాథ్‌సూరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-17T05:44:01+05:30 IST