స్కానింగ్‌ సదుపాయం కల్పించాలి: గర్భిణులు

ABN , First Publish Date - 2022-05-22T04:33:35+05:30 IST

మండలంలోని 30 పడకల ఆస్పత్రిలో స్కానింగ్‌ సదుపాయం కల్పించాలని గర్భి ణులు వేడుకుంటున్నారు. ఈమేరకు శనివారం వారు ఆస్పత్రికి పరీక్షల నిమిత్తం తరలివచ్చారు. ఇక్కడ స్కానింగ్‌ సదుపాయం లేక పోవడంతో వారు నిరాశ చెందారు.

స్కానింగ్‌ సదుపాయం కల్పించాలి: గర్భిణులు
జైనూరులో స్కానింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని కోరుతున్న గర్భిణులు

జైనూరు, మే 21: మండలంలోని 30 పడకల ఆస్పత్రిలో స్కానింగ్‌ సదుపాయం కల్పించాలని గర్భి ణులు వేడుకుంటున్నారు. ఈమేరకు శనివారం వారు ఆస్పత్రికి పరీక్షల నిమిత్తం తరలివచ్చారు. ఇక్కడ స్కానింగ్‌ సదుపాయం లేక పోవడంతో వారు నిరాశ చెందారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఎండలో స్కానింగ్‌ టెస్టుల కోసం వచ్చామని, ఇక్కడ ఎలాంటి పరీక్షలసదుపాయం కల్పించడం లేదన్నారు. ఆదిలాబాద్‌కు వెళ్లాలంటే 120కిలోమీటర్లు పడుతుం దని చేతిలో చిల్లి గవ్వలేని తాము ఎలా వెళ్ళగలమని వారు వాపోతున్నారు. అదేవిధంగా స్కానింగ్‌ కోసం దూరప్రాంతాలకు ఎండలో రాక పోకలు చేయాలంటే చాలా ఇబ్బంది అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జైనూరులోని 30పడకల ఆస్పత్రిలో గర్భిణులకు స్కానింగ్‌సెంటర్‌ ఏర్పాటుచేయాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2022-05-22T04:33:35+05:30 IST