Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 26 Sep 2021 19:49:41 IST

దళిత విద్యార్థులు తిన్న ప్లేట్లు వారే శుభ్రం చేసుకుని దూరంగా పెట్టుకోవాలట: ప్రిన్స్‌పాల్ ఆదేశం

twitter-iconwatsapp-iconfb-icon
దళిత విద్యార్థులు తిన్న ప్లేట్లు వారే శుభ్రం చేసుకుని దూరంగా పెట్టుకోవాలట: ప్రిన్స్‌పాల్ ఆదేశం

మెయిన్‌పురి (ఉత్తరప్రదేశ్): దళిత విద్యార్థులు భోజనం చేసిన తర్వాత వారి ప్లేట్లు వారే శుభ్రం చేసుకోవాలని, వాటిని ఎవరూ ముట్టుకోకుండా దూరంగా పెట్టుకోవాలని ఓ ప్రిన్సిపాల్ ఆదేశించారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. విషయం ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు. ఇద్దరు వంటమనుషులను విధుల నుంచి తప్పించారు. 


బేవార్ బ్లాక్‌, దోడాపూర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో దళిత విద్యార్థలుపై జరుగుతున్న ఈ అమానుషాన్ని గ్రామ ప్రధాన్ మంజుదేవి భర్త సాహెబ్ సింగ్ తమ దృష్టికి తీసుకొచ్చినట్టు చీఫ్ డెవలప్‌మెంట్ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశామని, మరో ఇద్దరు వంటవాళ్లను తప్పించినట్టు చెప్పారు. 


మొత్తం విద్యార్థుల్లో 80 మంది వరకు ఉన్న దళిత విద్యార్థులపై పాఠశాలలో వివక్ష కొనసాగుతోందని సాహెబ్ సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత అందరిలా కాకుండా వారు తిన్న ప్లేట్లను వారితోనే శుభ్రం చేయిస్తున్నారని, వాటిని మిగతా వారి ప్లేట్లకు దూరంగా పెట్టిస్తున్నారని పేర్కొన్నారు.  


ఫిర్యాదు అందుకున్న వెంటనే బేసిక్ శిక్షా అధికారి కమల్ సింగ్, ప్రాజెక్టు డైరెక్టర్ కేకే సింగ్‌తో కలిసి వినోద్ కుమార్ స్కూలును సందర్శించి వంటగదిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరోపణలు నిజమని తేల్చారు. దీంతో ఇద్దరు వంట మనుషులను తొలగించడమే కాకుండా ప్రిన్సిపాల్ గరీమాసింగ్ రాజ్‌పుత్‌ను సస్పెండ్ చేసినట్టు సీడీవో వినోద్ కుమార్ తెలిపారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.