Ambani కుటుంబానికి Security అంశంలో త్రిపుర హైకోర్ట్ ఆదేశాలపై Supreme Court స్టే

ABN , First Publish Date - 2022-06-29T21:42:10+05:30 IST

సంపన్న వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(రిల్) అధినేత ముకేష్ అంబానీ, ఆయన కుటుంబానికి కల్పిస్తున్న భద్రతా రికార్డుల వివరాలు వెల్లడించాలంటూ

Ambani కుటుంబానికి Security అంశంలో త్రిపుర హైకోర్ట్ ఆదేశాలపై Supreme Court స్టే

న్యూఢిల్లీ : సంపన్న వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) అధినేత ముకేష్ అంబానీ(Mukesh Ambani), ఆయన కుటుంబానికి(Family) కల్పిస్తున్న భద్రతా(Security) రికార్డుల వివరాలు వెల్లడించాలంటూ త్రిపుర హైకోర్ట్(Tripura High Court) జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్ట్(Supreme Court) స్టే(Stay) విధించింది. త్రిపుర హైకోర్ట్ ఆదేశాలపై సొలిసిటర్ జనరల్(Soliciter General) తుషార్ మెహతా(Thusar mehta) లేవనెత్తిన  అభ్యంతరాల దృష్ట్యా సుప్రీంకోర్టులో కేంద్ర హోంశాఖ(Home ministry) పిల్(PIL) దాఖలు చేసింది. పరిశీలనలోకి తీసుకున్న న్యాయమూర్తులు సూర్యకాంత్, జేడీ పార్దీవాలాతో కూడిన సుప్రీం బెంచ్.. స్టే విధించింది.


త్రిపుర హైకోర్ట్ ఆదేశాల్లో ప్రాదేశిక అధికారి పరిధి కొరవడిందని తుషార్ మెహతా అన్నారు. కేంద్ర ప్రభుత్వ సిఫార్సుల మేరకు ముకేష్ అంబానీ, ఆయన కుటుంబానికి మహారాష్ట్ర ప్రభుత్వం(Maharastra Govt) భద్రత కల్పిస్తోందని ఆయన ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధంగా కల్పిస్తున్న భద్రతపై న్యాయ సమీక్ష చేయాలని త్రిపుర హైకోర్ట్ నిర్ణయించినట్టు ఉందని తుషార్ మెహతా వ్యాఖ్యానించారు. గతంలో ఇలాంటి పిటిషనే బొంబై హైకోర్ట్(Bombay) ముందు దాఖలైంది. ఈ పిటిషన్‌ను గతంలో కొట్టివేశారు. సుప్రీంకోర్ట్‌లో అప్పీలు చేసినా  కొట్టివేశారని ప్రస్తావించారు.

Updated Date - 2022-06-29T21:42:10+05:30 IST