ఎస్సీ రిజర్వేషన్‌లకు చట్టబద్ధత కల్పించాలి

ABN , First Publish Date - 2022-07-03T05:06:04+05:30 IST

ఎస్వీ రిజర్వేషన్లకు చట్ట బద్ధత కల్పించాలని ఎంఆర్‌పీఎస్‌, ఎంఎస్‌పీ నేతలు డిమాండ్‌ చేశారు.

ఎస్సీ రిజర్వేషన్‌లకు చట్టబద్ధత కల్పించాలి
్ఠసడక్‌బంద్‌లో నిరసన తెలుపుతున్న ఎంఆర్‌పీఎస్‌, ఎంఎస్‌పీ శ్రేణులు


ఎంఆర్‌పీఎస్‌, ఎంఎస్‌పీ ఆధ్వర్యంలో ‘సడక్‌ బంద్‌’ 

 భగ్నం చేసిన పోలీసులు 

పీలేరు, జూలై 2: ఎస్వీ రిజర్వేషన్లకు చట్ట బద్ధత కల్పించాలని ఎంఆర్‌పీఎస్‌, ఎంఎస్‌పీ నేతలు డిమాండ్‌ చేశారు. ఆమేరకు శని వారం పీలేరులో ‘సడక్‌ బంద్‌’(జాతీయ రహదారుల దిగ్బంధం) చేపట్టాయి.  ఉద యం పీలేరు-కడప మార్గంలోని యల్లమంద క్రాస్‌ సమీపంలో కడప-చెన్నై రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. విషయం తెలు సుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎం ఆర్‌పీఎస్‌ నాయకుడు సుధాకర్‌ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు తాము అనుకూలమని గతంలో హామీ ఇచ్చిన బీజేపీ అధికారంలోకి వచ్చాక దాని గురించి పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలన్నారు. స్టేషన్‌కు తరలించిన వారిని పోలీసులు సాయంత్రం వరకు అక్కడే ఉంచుకుని స్వంత పూచీకత్తు పై వదిలిపెట్టారు. ‘సడక్‌ బంద్‌’ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు శనివారం వేకువ జాము నుంచే పలువురు ఎంఆర్‌పీఎస్‌, ఎంఎస్‌పీ నాయకులను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. అయినప్పటికీ దాదాపు అరగంటసేపు వారు కడప-చెన్నై జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు.  కార్యక్రమంలో కోళ్లఫారం రమణ,  గండికోట వెంకటేశ్‌, దుడ్డు రామకృష్ణ, అశోక్‌, శీన, శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు. 

ములకలచెరువులో: ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్పీ నాయకులు జాతీయ రహదారిని దిగ్భంధం చేశారు. సడక్‌ బంద్‌లో భాగంగా ములకలచెరువు షాదీమహాల్‌ సమీపంలోని పెట్రోల్‌ బంకు వద్ద ముంబా యి - చెన్నై జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెం టు లో ఆమోదించాలని నినాదాలు చేశారు. ఆందోళ న చేస్తున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్ళారు. కార్యక్రమంలో తంబళ్ళపల్లె నియోజకవర్గ ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు ప్రతాప్‌కుమార్‌, ఇన్‌చార్జి దుమ్ము చిన్నా, జిల్లా నాయకులు తిరుపాల్‌, వెంకటప్ప, మల్లికార్జున, నాయకులు చంద్ర, అంజి, కృష్ణప్ప, విజయ్‌కుమార్‌, రమణ, హరి, రాములమ్మ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-03T05:06:04+05:30 IST