రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమం చేపట్టాలి

ABN , First Publish Date - 2021-03-08T05:03:56+05:30 IST

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), మార్చి 7: రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రజలకు ప్రాథమిక హక్కులు అందకుండా చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఎంప్లాయీస్‌, ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ గోవాడ వీర్రాజు పేర్కొ

రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమం చేపట్టాలి
సమావేశంలో ఐక్యత చాటుతున్న దళిత సంఘాల నాయకులు

ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఎంప్లాయీస్‌,   

ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు గోవాడ వీర్రాజు 

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), మార్చి 7: రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రజలకు ప్రాథమిక హక్కులు అందకుండా చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఎంప్లాయీస్‌, ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ గోవాడ వీర్రాజు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరూ ఉద్యమం చేపట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. సుందరయ్య భవన్‌లో ఆదివారం అసోసియేషన్‌ అధ్యక్షుడు మర్రె బాబ్జి అధ్యక్షతన రాజ్యాంగ నిబంధనలు- అమలు తీరుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మూవ్‌మెంట్‌ ఫర్‌ జస్టిస్‌ అండ్‌ పీస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌కే సుభాన్‌ మాట్లాడుతూ బహుజనులకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయని, ఐక్య పోరాటం ద్వారానే రాజ్యాంగ హక్కులు కాపాడుకోవాలన్నారు. సమావేశంలో న్యాయవాది టి.ఫృథ్వీరాజ్‌, గుడాల కృష్ణ, అయితాబత్తుల రామేశ్వరరావు, పెయ్యల పావనప్రసాద్‌, డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావు, డాక్టర్‌ కిరణ్‌కుమార్‌, ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.బాబ్జి, సెట్రాజ్‌ సీఈవో ఎంభానుప్రకాష్‌, సమగ్రశిక్షా అభియాన్‌ ఏపీవో విజయభాస్కర్‌, సీహెచ్‌ సుబ్బారావు, డాక్టర్స్‌ సుహాసిని, సాధనాల శాంతి, మెహర్‌, పులుగు దీపక్‌, అరుణ్‌ప్రకాష్‌, ఎంఎన్‌ఎ్‌సఎస్‌ సింగ్‌, పాకా సత్యనారాయణ, సయ్యద్‌ సాలార్‌, తాడిబాబ్జి, పిట్టా వరప్రసాద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-08T05:03:56+05:30 IST