బీఎస్పీలో చేరిన అఖిలేష్ కూటమి సీనియర్ నేత

ABN , First Publish Date - 2022-01-15T01:21:30+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగుతున్నాయి. కొందరు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్తుంటే.. కొందరు ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వస్తున్నారు. సాధారణంగా ఎన్నికల ముందు దేశమంతటా జరిగే ప్రక్రియే ఇది..

బీఎస్పీలో చేరిన అఖిలేష్ కూటమి సీనియర్ నేత

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగుతున్నాయి. కొందరు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్తుంటే.. కొందరు ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వస్తున్నారు. సాధారణంగా ఎన్నికల ముందు దేశమంతటా జరిగే ప్రక్రియే ఇది. టికెట్ల కేటాయింపులు, పార్టీలో పట్టింపులు ఈ ఫిరాయింపులకు ప్రధాన కారణం. కాగా, తాజాగా సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు మానతీ రాజ్‌భర్ పార్టీ ఫిరాయించారు. శుక్రవారం ఆమె మాయావతి సమక్షంలో బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. కొద్ది రోజుల క్రితం బీఎస్పీ నేతలు సమాజ్‌వాదీ పార్టీలోకి వెళ్లారు. కాగా, తాజాగా ఎస్పీ అలయెన్స్ అయిన ఎస్బీఎస్పీ నుంచి బీఎస్‌పీలోకి రావడం గమనార్హం. ఇక పార్టీ చేరికల్లో రాష్ట్రంలో ఎస్పీ ముందు వరుసలో ఉంది. అధికార పార్టీ అయిన బీజేపీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఎస్పీలోకి వస్తున్నాయి. పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులు ఎదుర్కొంటున్న పార్టీగా బీజేపీ పేరు వినిపిస్తోంది. ఈ పార్టీ నుంచే ఎక్కువ మంది నేతలు వేరే పార్టీల్లోకి వెళ్తున్నారు.

Updated Date - 2022-01-15T01:21:30+05:30 IST