రైతుల కోసం ఎస్‌బీఐ ‘యోనో కృషి’

ABN , First Publish Date - 2020-08-15T06:20:27+05:30 IST

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తమ యోనో యాప్‌లో మరో కొత్త ఫీచర్‌ యోనో కృషిని జోడించింది. దీని ద్వారా రైతులు బ్యాంకుకు రావాల్సిన అవ సరం లేకుండానే ఇంటి నుంచి ఎలాంటి పేప ర్‌ వర్క్‌ లేకుండా...

రైతుల కోసం ఎస్‌బీఐ ‘యోనో కృషి’

ముంబై: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తమ యోనో యాప్‌లో మరో కొత్త ఫీచర్‌ యోనో కృషిని జోడించింది. దీని ద్వారా రైతులు బ్యాంకుకు రావాల్సిన అవ సరం లేకుండానే ఇంటి నుంచి ఎలాంటి పేప ర్‌ వర్క్‌ లేకుండా తమ కిసాన్‌ క్రెడిట్‌ కార్డుపై రుణ పరిమితి పెంచాలని అభ్యర్థించవచ్చు. కేవలం నాలుగే నాలుగు క్లిక్‌ల ద్వారా త్వరితంగా దీన్ని పూర్తి చేయవచ్చని ఎస్‌బీఐ ప్రకటించింది. రైతులందరి వద్ద స్మార్ట్‌ఫోన్లు ఉండవచ్చని భావించి ఈ ఫీచర్‌ ప్రవేశపెట్టినట్టు తెలిపింది. ఇది డిజిటల్‌ వ్యవసాయాన్ని రైతు ముగింటికి తెచ్చే చర్యగా ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ అభివర్ణించారు. వ్యవసాయ రుణాలు పొందడంతో పాటు వ్యవసాయ ఉపకరణాలు, పనిముట్ల క్రయవిక్రయాలకు, వ్యవసాయ సలహాలు పొందడానికి, పంట బీమా ఉత్పత్తులు పొందడానికి, వ్యవసాయ అవసరాల కోసం బంగారంపై రుణాలు పొందడానికి కూడా ఇది అనువుగా ఉంటుందని ఎస్‌బీఐ తెలిపింది. 


హెచ్‌డీఎఫ్‌సీ శౌర్య కేజీసీ కార్డు: దేశంలోని సైనికోద్యోగులు తమ కుటుంబాల వ్యవసాయ అవసరాలకు ఆదుకోవడానికి వీలు కల్పిస్తూ ఒక కొత్త రకం వ్యవసాయ రుణ సదుపాయం హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘శౌర్య కేజీసీ కార్డు’ ప్రారంభించింది. ఈ కార్డు సహాయంతో వారు స్వల్పకాలిక పంట రుణాలు, దీర్ఘకాలిక వ్యవసాయ పెట్టుబడులకు రుణసహాయం పొందవచ్చునని తెలిపింది. 


Updated Date - 2020-08-15T06:20:27+05:30 IST