ఏపీ ప్రభుత్వానికి ఎస్‌బీఐ షాక్

ABN , First Publish Date - 2021-09-30T23:21:24+05:30 IST

ఏపీ ప్రభుత్వానికి ఎస్‌బీఐ షాక్

ఏపీ ప్రభుత్వానికి ఎస్‌బీఐ షాక్

అమరావతి: ఏపీ ప్రభుత్వానికి ఎస్‌బీఐ షాక్ ఇచ్చింది. రూ. 6500 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ ఇవ్వడానికి ఎస్‌బీఐ నిరాకరించింది. సీఎస్ఎస్ పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ కోసం ఏపీ ప్రభుత్వం అష్ట కష్టాలు పడుతోంది. మరోవైపు ఏపీ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకీ దిగజారుతోంది. ఈ సమయంలో ఎస్‌బీఐ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వ యంత్రాంగంలో ఆందోళన ప్రారంభమైంది. 


కాగా సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వం అప్పులు తీసుకుంటూ ఇప్పటికే ప్రజల ఖాతాల్లోకి వందల, వేల కోట్ల నిధులు జమ చేస్తోంది.  దీంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల కుప్ప పెరుగుతోంది. మరోవైపు కొన్ని బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఎస్‌బీఐతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుని రుణాలు తీసుకుంటోంది. తాజాగా ఎస్బీఐ తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి. 

Updated Date - 2021-09-30T23:21:24+05:30 IST