దేశవ్యాప్తంగా నిలిచిపోయిన SBI సేవలు.. ఖాతాదారుల గగ్గోలు

ABN , First Publish Date - 2022-06-30T23:47:52+05:30 IST

భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఎస్‌బీఐకి

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన SBI సేవలు.. ఖాతాదారుల గగ్గోలు

న్యూఢిల్లీ: భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఎస్‌బీఐకి చెందిన అన్ని సేవలు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా నిలిచిపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్, నగదు బదిలీ వంటివాటితోపాటు ఏటీఎం నుంచి నగదు డ్రా చేసుకోవడంలోనూ సమస్యలు ఎదురవుతుండడంతో సామాజిక మాధ్యమాల వేదికగా ఖాతాదారులు ఫిర్యాదు చేస్తున్నారు.


ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా ఎస్‌బీఐ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ఎస్‌బీఐ యోనో యాప్ కూడా అందుబాటులో లేకుండా పోయింది. యాప్ మెయింటెనెన్స్‌లో ఉన్నట్టు ఓ మెసేజ్ దర్శనమిస్తోంది. అలాగే, యూపీఐ విషయంలోనూ ఇదే పరిస్థితి ఎదురవుతున్నట్టు ఖాతాదారులు చెబుతున్నారు.


Updated Date - 2022-06-30T23:47:52+05:30 IST