పెద్ద మొత్తం డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన SBI.. ఎంతంటే..

ABN , First Publish Date - 2022-05-10T21:49:14+05:30 IST

ముంబై : పెద్ద మొత్తంలో డిపాజిట్ల(రూ.2 కోట్లు, అంతకంటే ఎక్కువ)పై వడ్డీ రేటు 40- 90 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్టు దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ SBI ప్రకటించింది. Intrest rate hike మే 10 (నేటి నుంచి) ఆచరణలోకి వస్తుందని స్పష్టం చేసింది.

పెద్ద మొత్తం డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన SBI.. ఎంతంటే..

ముంబై : పెద్ద మొత్తం డిపాజిట్ల(రూ.2 కోట్లు, అంతకంటే ఎక్కువ)పై వడ్డీ రేటును 40- 90 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్టు ప్రభుత్వరంగం, దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ SBI ప్రకటించింది. Intrest rate hike మే 10 (నేటి నుంచి) అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో రూ.2 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లపై 5-10 ఏళ్ల కాలపరిమితి, 3 - 5 ఏళ్ల కాలపరిమితులపై వడ్డీ రేటు 4.50 శాతానికి పెరిగింది. తాజా పెంపునకు ముందు ఈ కాలపరిమితుల వడ్డీ రేటు 3.60 శాతంగా ఉందని ఎస్‌బీఐ వెబ్‌సైట్ పేర్కొంది. కాగా 2-3 ఏళ్ల కాలపరిమితి బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేటు 4.25 శాతానికి పెరగనున్నాయి. పెంపునకు ముందు ఈ కేటగిరీ వడ్డీ రేట్లు 3.60 శాతంగా ఉన్నాయని ఎస్‌బీఐ ప్రస్తావించింది. ఇక 1-2 ఏళ్ల కాలపరిమితిపై గత వడ్డీ 3.60 శాతం ఉండగా తాజాగా అది 4 శాతానికి పెరిగింది. మరోవైపు 46 -179 రోజులు, 180-210 రోజుల కాలపరిమితుల వడ్డీ రేటు 3.50 శాతానికి పెరగనుందని వివరించింది. ఇక 210 - నుంచి ఒక ఏడాది కాలపరిమితి డిపాజిట్ వడ్డీరేటు 3.75 శాతానికి చేరిందని వివరించింది. 


వడ్డీరేటు పెంపుపై ఎస్‌బీఐ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి ఒకరు స్పందించారు. రెపో రేటు పెరగడంతో బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించామని ఆయన తెలిపారు. మరోవైపు కొంతకాల వ్యవధిలో వ్యవస్థలో నగదు లభ్యత కూడా తగ్గనుందని ఆయన వివరించారు. కాబట్టి రానున్న నెలల్లో ఎదురుకానున్న సవాళ్లను ఎదుర్కొనేందుకుగానూ బల్క్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది. కాగా ఆర్బీఐ రెపో రేటు పెంపు ప్రకటన చేసిన తర్వాత బంధన్ బ్యాంక్, కోటక్ మహింద్రా బ్యాంక్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బ్యాంక్ ఆప్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకులు ఇప్పటికే డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించాయి.

Read more