ఎస్‌బీఐ పండుగ బొనాంజా

ABN , First Publish Date - 2020-09-29T06:55:56+05:30 IST

దేశంలోని అతి పెద్ద బ్యాంకు ఎస్‌బీఐ రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కస్టమర్లకు పలు ఆఫర్లు ప్రకటించింది. యోనో యాప్‌ ద్వారా కార్ల కొనుగోలుకు, బంగారం, వ్యక్తిగత రుణాలు తీసుకునేందుకు ముందుకు వచ్చే కస్టమర్లకు నూరు శాతం ప్రాసెసింగ్‌ ఫీజు రద్దు చేయడం...

ఎస్‌బీఐ  పండుగ బొనాంజా

  • కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు
  • రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజు పూర్తిగా రద్దు

ముంబై: దేశంలోని అతి పెద్ద బ్యాంకు ఎస్‌బీఐ రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కస్టమర్లకు పలు ఆఫర్లు ప్రకటించింది. యోనో యాప్‌ ద్వారా కార్ల కొనుగోలుకు, బంగారం, వ్యక్తిగత రుణాలు తీసుకునేందుకు ముందుకు వచ్చే కస్టమర్లకు నూరు శాతం ప్రాసెసింగ్‌ ఫీజు రద్దు చేయడం ఇందులో ప్రధానమైనది. అలాగే బ్యాంకు అనుమతించిన వెంచర్లలో ఇళ్లు కొనుగోలు చేసిన వారికి కూడా ఇంటి రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజు పూర్తిగా రద్దు చేశారు. 


ఇతర ఆఫర్లు..

  1. మంచి క్రెడిట్‌ స్కోరున్న కస్టమర్లకు ఇంటి రుణాలపై 0.10 శాతం వరకు వడ్డీ రాయితీ ఇస్తారు. యోనో యాప్‌ ద్వారా దరఖాస్తు చేసిన వారికి మరో 0.5 శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. 
  2. ఎస్‌బీఐ అతి తక్కువ వడ్డీ రేటు 7.5 శాతానికే కారు రుణాలందిస్తోంది. కొన్ని ఎంపిక చేసిన మోడల్‌ కార్లపై నూరు శాతం ఆన్‌ రోడ్‌ ధరకు రుణాలందిస్తారు. 
  3. బంగారం రుణాలపై 7.5 శాతం వడ్డీ రేటుకే బ్యాంకు రుణాలందిస్తోంది. 36 నెలల రుణ చెల్లింపు వ్యవధి కూడా ఇస్తోంది. కారు, బంగారం రుణాలకు యోనో సూత్రప్రాయమైన అంగీకారం అందిస్తోంది.   
  4. పండుగ సీజన్‌ సందర్భంగా కస్టమర్లు 9.6 శాతం కనిష్ఠ రేటుకే వ్యక్తిగత రుణాలు పొందవచ్చు. అలాగే కస్టమర్లు బ్యాంకుకు వెళ్లాల్సిన పని లేకుండానే ఎలాంటి పత్రాల అవసరం లేకుండా ప్రీ అప్రూవ్డ్‌ పర్సనల్‌ రుణాలు పొందవచ్చు.

  5.  కాగా ఆటోమొబైల్‌ రుణాల విభాగంలో ఎస్‌బీఐ 33 శాతం వాటా కలిగి ఉంది. ఎస్‌బీఐలో ఇంటర్నెట్‌ బ్యాంకిం గ్‌ సదుపాయం ఉపయోగించుకుంటున్న కస్టమర్లు 76 శాతం ఉన్నారు. మొబైల్‌ బ్యాంకిం గ్‌ సర్వీసు ఉపయోగించుకుంటున్న వారు 1.7 కోట్లకు పైబడే ఉన్నారు. యోనో యాప్‌కు 2.6 కోట్ల మందికి పైగా రిజిస్టర్డ్‌ కస్టమర్లున్నారు. ప్రతీ రోజూ 55 లక్షల మంది లాగిన్‌ అవుతూ ఉంటారు. ఈ యాప్‌ ద్వారా రోజుకి నాలుగు వేల వ్యక్తిగత రుణాలు బట్వాడా అవుతున్నాయి. 16 వేలకు పైగా యోనో కృషి వ్యవ సాయ రుణాలు అందించారు.






‘‘ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటున్న నేపథ్యంలో వినియోగ వ్యయాలు పెరుగుతాయని ఎస్‌బీఐ భావిస్తోంది. దీనికి తోడు పండుగల సీజన్‌ ఆనందమయంగా ఉండడానికి కస్టమర్లకు ఎస్‌బీఐ చేయూత అందిస్తోంది’’.

- సీఎస్‌ శెట్టి, ఎండీ (రిటైల్‌, డిజిటల్‌ బ్యాంకింగ్‌)

Updated Date - 2020-09-29T06:55:56+05:30 IST