వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్‌బీఐ

ABN , First Publish Date - 2020-07-09T06:10:24+05:30 IST

ప్రభుత్వ రంగంలోని ఎస్‌బీఐ మరోసారి ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేట్లు తగ్గించింది. ఈ తగ్గింపు అయిదు నుంచి పది బేసిస్‌ పాయింట్ల (100 బేసిన్‌ పాయింట్లు ఒక శాతానికి సమానం) వరకు ఉంటుందని తెలిపింది...

వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్‌బీఐ

ముంబై: ప్రభుత్వ రంగంలోని ఎస్‌బీఐ మరోసారి ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేట్లు తగ్గించింది. ఈ తగ్గింపు అయిదు నుంచి పది బేసిస్‌ పాయింట్ల (100 బేసిన్‌ పాయింట్లు ఒక శాతానికి సమానం) వరకు ఉంటుందని తెలిపింది. దీంతో మూడు నెలల స్వల్ప కాలిక రుణాలపై ఎస్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటు 6.65 శాతానికి తగ్గుతుంది. శుక్రవారం నుంచి ఈ తగ్గింపు అమల్లోకి వస్తుందని ఎస్‌బీఐ తెలిపింది. ప్రభుత్వ రంగంలోని ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ కూడా తన ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేటును 25 బేసిస్‌ పాయింట్ల వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఇది కూడా శుక్రవారం నుంచే అమల్లోకి వస్తుంది.


Updated Date - 2020-07-09T06:10:24+05:30 IST