ఏటీఎం యూజర్లకు ఎస్‌బీఐ సూచనలు

ABN , First Publish Date - 2021-01-10T21:41:50+05:30 IST

ఏటీఎం, పీవోఎస్ మిషన్లను ఉపయోగించే సమయంలో..

ఏటీఎం యూజర్లకు ఎస్‌బీఐ సూచనలు

న్యూఢిల్లీ: ఏటీఎం, పీవోఎస్ మిషన్లను ఉపయోగించే సమయంలో పాటించవలసిన కొన్ని అతిముఖ్యమైన భద్రతా నియమాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు సూచించింది. సురక్షితమైన లావాదేవీలు జరగడానికి ఎస్‌బీఐ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, సైబర్ క్రైం నిందితులు వేరే దారులు వెతుకుతున్నారని తెలిపింది. ఇలాంటి సందర్భంలో ఖాతాదారులు తగిన భద్రతా నియమాలను పాటించవలసిందిగా కోరింది. 


అవేంటంటే..

1. ఏటీఎం, పీవోఎస్ మిషన్లలో మీ ఏటీఎం కార్డు పాస్‌వర్డ్ ఎంటర్ చేసే సమయంలో మీ చేతిని అడ్డుగా ఉంచుకోండి.

2. మీ ఏటీఎం కార్డు పిన్‌ నంబర్‌ను ఎట్టిపరిస్థితుల్లో ఇతరులతో షేర్ చేసుకోకండి.

3. మీ ఏటీఎం కార్డు పిన్ నంబర్‌ను మీ కార్డుపై రాసుకోకండి.

4. మీ ఏటీఎం కార్డు పిన్ నంబర్ చెప్పమని వచ్చే ఫోన్ కాల్స్, ఈమెల్స్, మెసెజెస్‌కు స్పందించకండి.

5. మీ సెల్‌ఫోన్, అకౌంట్ నంబర్‌కు ఉండే నంబర్స్‌ను మీ ఏటీఎం కార్డు పాస్‌వర్డుగా పెట్టుకోకండి.

6. మీ ట్రాన్సాక్షన్ పేపర్‌ను చించి చెత్తబుట్టలో వేయండి.

7. మీ ట్రాన్సాక్షన్ మొదలు పెట్టే ముందే ఏమైనా స్పై కెమెరాలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి.

8. ట్రాన్సాక్షన్ వివరాలు తెలుసుకోవడానికి మీ ఫోన్ నంబర్‌ను ఖాతాకు జతచేసుకోండి.


Updated Date - 2021-01-10T21:41:50+05:30 IST